క్రీడాభూమి

కోహ్లీ అత్యుత్తమ కెప్టెన్, మంచి స్నేహితుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాఫ్రికా: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోని అన్ని జట్ల కెప్టెన్‌ల కంటే అత్యుత్తముడని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. కోహ్లీ తనకు మంచి మిత్రుడని వ్యాఖ్యానించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (లీగ్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కోహ్లీతో 2011 నుంచి డివిలియర్స్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. ఒక టీవీ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో డివిలియర్స్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచంలోని క్రికెట్ కెప్టెన్‌ల కంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే గొప్ప ఆటగాడని అన్నాడు. ప్రపంచంలో ఎంతోమంది మంచి కెప్టెన్‌లలో న్యూజిలాండ్‌కు చెంది న కేన్ విలియమ్సన్, దక్షిణాఫ్రికాకు చెందిన ఫఫ్ డుప్లెసిస్ వంటివారు ఉన్నారన్నాడు. వారందరి కంటే విరాట్ గొప్ప కెప్టెన్ అని డివిలియర్స్ ప్రస్తుతించాడు. మిస్టర్ 360గా ప్రసిద్ధిగాంచిన డివిలియర్స్ ఈ ఏడాది మేలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. రాయల్ చా లెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన ఐపీఎల్ మ్యాచ్‌లలో మూడు సెంచరీలు చేశాడు. దేశవాళీ, ఐపీఎల్ మ్యాచ్‌లలో ఆడతానని స్పష్టం చేశాడు.