క్రీడాభూమి

మా జట్టు సమతూకంగా ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: తమ జట్టు సమతూకంగా ఉందని, అన్ని విభాగాల్లోనూ రాణించగలుగుతున్నామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. శనివారం రాత్రి వర్షం కారణంగా ఆలస్యంగా ఆరంభమైన మ్యాచ్‌లో బలమైన ప్రత్యర్థి రాయల్ చాలెంజర్స్ బెంగళూరును 15 పరుగుల తేడాతో ఓడించడంతో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని అన్నాడు. ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్‌ను ఎంచుకోగా, మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 28 పరుగుల స్కోరువద్ద మొదటి వికెట్‌ను శిఖర్ ధావన్ వికెట్‌ను చేజార్చుకుంది. అతను 11 పరుగులు చేసి, కేన్ రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరోసారి చెలరేగిపోయిన కెప్టెన్ డేవిడ్ వార్నర్ 50 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, ఐదు సిక్సర్లతో 92 పరుగులు చేసి, దురదృష్టవశాత్తు సెంచరీ పూర్తికాకుండానే డివిలియర్స్ క్యాచ్ అందుకోగా తబ్రైజ్ షంసీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అతను డేన్ విలియమ్‌సన్‌తో కలిసి రెండో వికెట్‌కు 124 పరుగుల అత్యంత విలువైన భాగస్వామ్యాన్ని అందించాడు. తర్వాత కొద్దిసేపటికే విలియమ్‌సన్ (38 బంతుల్లో 50 పరుగులు/ ఏడు ఫోర్లు)ను లోకేష్ రాహుల్ క్యాచ్ అందుకోగా షేన్ వాట్సన్ అవుట్ చేశాడు. నమన్ ఓఝా కేవలం ఒక పరుగు చేసి రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో డివిలియర్స్‌కు చిక్కాడు. 2 పరుగులు చేసిన దీపక్ హూడా రనౌటయ్యాడు. 190 పరుగుల వద్ద సన్‌రైజర్స్ ఐదో వికెట్ కోల్పోయింది. ఆతర్వాత సన్‌రైజర్స్ మరో 5 పరుగులు చేయగలిగింది. 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 సాధించగా, అప్పటికి ఆశిష్ రెడ్డి (2), మోజెస్ హెన్రిక్స్ (31) నాటౌట్‌గా ఉన్నారు.
చినుకులు పడడంతో, బంతి వేగంగా కదలకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ, బెంగళూరు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, లోకేష్ రాహుల్ వేగంగా స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. 5.2 ఓవర్లలో వీరు మొదటి వికెట్‌కు 42 పరుగులు జోడించారు. ముస్త్ఫాజుర్ రహ్మాన్ బౌలింగ్‌లో ఆశిష్ రెడ్డి క్యాచ్ పట్టగా అవుటైన కోహ్లీ 17 బంతుల్లో 14 పరుగులు చేశాడు. వేగంగా పరుగులు రాబట్టిన లోకేష్ రాహుల్ 28 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 51 పరుగులు చేసి, మోజెస్ హెన్రిక్స్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ నమన్ ఓఝా క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. అతను డివిలియర్స్‌తో కలిసి రెండో వికెట్‌కు 4.4 ఓవర్లలో 41 పరుగులు జోడించాడు. వాట్సన్ రెండు పరుగులకే రనౌట్ కావడంతో బెంగళూరు కష్టాల్లో పడింది. అయితే, డివిలియర్స్ తనదైన శైలిలో విజృంభించడంతో అభిమానులు ఊరట చెందారు. మోజెన్ హెన్రిక్స్ వేసిన 14వ ఓవర్‌లో అతను రెండు సిక్సర్లు బాది బెంగళూరుకు విజయంపై ఆశలు కల్పించాడు. కానీ, అతని ప్రయత్నాలు ఫలించలేదు. 32 పరుగులు చేసిన అతను మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 47 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మొత్తం మీద బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 179 పరుగులు చేయగలిగింది. చివరిలో కేదార్ జాదవ్ 25 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఏడో మ్యాచ్ ఆడిన సన్‌రైజర్స్ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన వార్నర్ ఎనిమిది పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకోవడంపై పెద్దగా స్పందించలేదు. పరుగులు సాధించడం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుందని అన్నా డు. వ్యక్తిగత మైలురాళ్ల కంటే జట్టు ప్రయోజనాలే తనకు ముఖ్యమని అన్నాడు. బెంగళూరు వంటి జట్టు ను ఓడించడం సులభం కాదని, జట్టు మొత్తం సమష్టిగా కృషి చేసినందుకే గెలిచామని అన్నాడు.
కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన
సన్‌రైజర్స్ సారథి వార్నర్