క్రీడాభూమి

ఉదాసీనతే ప్రధాన కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, అక్టోబర్ 28: క్రికెట్ సంఘాలు, సమాఖ్యల ఉదాసీనతే బాల్ ట్యాంపరింగ్ వివాదాలకు ప్రధాన కారణమని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికా టూర్ సమయంలో చోటు చేసుకున్న బాల్ ట్యాంపరింగ్ సంఘటనను అతను ప్రస్తావిస్తూ, గతంలో కఠినంగా వ్యవహరించి ఉంటే, ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేవని అభిప్రాయపడ్డాడు. ఉద్దేశపూర్వకంగా బంతిని గరుకుగా ఉండే ప్రాంతంలోకి బలంగా విసరడం కూడా దాని ఆకారాన్ని మార్చే ప్రయత్నం కిందకే వస్తుందన్నాడు. ఫీల్డర్లు ఈ విధంగా గట్టిగా నేలకు తగిలేలా బంతిని విసరడంపై క్రికెట్ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించారని అన్నాడు. బంతి ఆకారాన్ని ఉద్దేశపూర్వకంగా మార్చిన సంఘటనలపై కఠినంగా వ్యవహరించలేదని స్పష్టం చేశాడు. బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఆటగాళ్లపై ఆరు టెస్టులు లేదా 12 వనే్డ ఇంటర్నేషనల్స్ నుంచి సస్పెండ్ చేసే అవకాశాన్ని కల్పిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి చర్యలు గతంలో ఉండివుంటే, బాల్ ట్యాంపరింగ్ ఈ స్థాయిలో జరిగి ఉండేది కాదన్నాడు. క్రీడాస్ఫూర్తితో ఆడాలని అతను క్రికెటర్లకు పిలుపునిచ్చాడు.