క్రీడాభూమి

బాల్ ట్యాంపరింగ్‌పై నేడే నివేదికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, అక్టోబర్ 28: బాల్ ట్యాంపరింగ్ సంఘటనతో ఉలిక్కిపడిన ఆస్ట్రేలియా క్రికెట్ అధికారులు ఆదేశించిన రెండు విచారణ కమిటీలు సోమవారం నివేదికలను ప్రకటించనున్నాయి. ఒక బృందం ఆస్ట్రేలియా క్రికెట్‌లో నెలకొన్ని పరిస్థితులను అధ్యయనం చేసింది. మరో బృందం జాతీయ జట్టులో ఆటగాళ్ల ప్రవర్తన, వారి మధ్య ఉన్న సయోధ్య లేదా విభేదాలు తదితర అంశాలను పరిశీలించింది. ఈ రెండు కమిటీలు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు నివేదికలను సమర్పిస్తాయి. అధికారంగా వాటిని సీఏ విడుదల చేస్తుంది. ఆసీస్ జట్టు దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లినప్పుడు, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై వేటు పడింది. వీరిద్దరినీ ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ మార్చి మాసంలో ఉత్తర్వులు జారీ చేసింది. అంతేగాక, బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించింది. ఈ సంఘటన తర్వాత ఆస్ట్రేలియా ప్రతిష్ట దారుణంగా దెబ్బతిన్నది. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్లాండ్‌కు ఈ వివాదంతో సంబంధం లేకపోయినప్పటికీ, తన పదవి నుంచి అతను వైదొలిగాడు. సహజంగానే ఈ పరిణామాలు అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలనం రేపాయి. సీఏ నివేదికల్లో ఉండబోయే అంశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.