క్రీడాభూమి

రికార్డుల వైస్ కెప్టెన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: టీమిండియా వైస్‌కెప్టెన్, ఓపెనర్ 31 ఏళ్ల రోహిత్ శర్మ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో దిగ్గజ ఆటగాళ్లు సచిన్ తెండూల్కర్, సౌరవ్ గంగూలీని దాటేశాడు. వెస్టిండీస్‌తో సోమవారం ఇక్కడ బ్రబోర్న్ స్టేడియంలో జరిగిన మూడో వన్డే లో రోహిత్ 162 పరుగులు సాధించాడు. 137 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 4 సిక్సర్లు, 20 బౌండరీలతో చెలరేగి ఆడాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో రోహిత్ ఇప్పటివరకు రెండు సెంచరీలు నమోదు చేశాడు. వనే్డల్లో రోహిత్‌కు ఇది 21 సెంచరీ కావడం విశేషం. సచిన్ తెండూల్కర్ 200 ఇన్నింగ్స్‌ల్లో 21 సెంచరీలు చేయగా, సౌరవ్ గంగూలీ 217 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. అయితే, రోహిత్ శర్మ కేవలం 186 ఇన్నింగ్స్‌ల్లోనూ ఈ రికార్డు సాధించడం ద్వారా సచిన్, గంగూలీ రికార్డును దాటేశాడు. కాగా, అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 21 సెంచరీలు సాధించిన రికార్డు ఇంతవరకు దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీమ్ ఆమ్లా (116) పేరిట ఉంది. ఆ తర్వాత స్థానంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (138), మూడోస్థానంలో ఏబీ డివిలియర్స్ (183) ఉన్నారు. ఇదిలావుండగా, రోహిత్ శర్మ సిక్సర్ల నమోదులో సైతం సచిన్ తెండూల్కర్‌ను దాటాడు. సచిన్ 21 వన్డేల్లో 195 సిక్సర్లు కొట్టగా, రోహిత్ శర్మ 197 సిక్సర్లు కొట్టడం ద్వారా ఎక్కువ సిక్సర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఏడో స్థానంలో చోటు దక్కించుకున్నాడు. వన్డే క్రికెట్‌లో ఆరుసార్లు 150కి పైగా పరుగులు సాధించిన తొలి వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు.

చిత్రం..సచిన్, గంగూలీని అధిగమించిన రోహిత్