క్రీడాభూమి

పదవి నుంచి వైదొలగండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, అక్టోబర్ 30: బాల్ ట్యాంపరింగ్ అంశం క్రికెట్ ఆస్ట్రేలియాను ఇంకా కుదిపేస్తోంది. ఈకేసులో ఆరోపణలు వెల్లువెత్తుతున్న దృష్ట్యా పదవి నుంచి వైదొలగాల్సిందిగా రెండోసారి నియమితుడైన క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ డేవిడ్ పీర్‌కు మంగళవారం తీవ్రస్థాయిలో వత్తిళ్లు వచ్చాయి. ఓ స్వతంత్ర సంస్థ నిర్వహించిన సమీక్ష సారాంశాన్ని సోమవారం నాడిక్కడ విడుదల చేయగా ‘గెలవడానికి క్రీడాకారుల్లో మోసపూరితమైన సంస్కృతిని ప్రోత్సహిస్తున్న క్రికెట్ ఆస్ట్రేలియా వైఖరిని తప్పుబట్టుతూ మెజారిటీ అభిప్రాయం వెల్లడైంది.
గత మార్చి నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో శాండ్‌పేపర్‌ను ఉపయోగించి బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఆస్ట్రేలియా క్రీడాకారులు కెమెరాకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో జేమ్స్ సదర్లాండ్, కోచ్ డారన్ లీమన్, టీం ఫర్మార్మెన్స్ బాస్ పాట్ హవార్డ్‌లు పదవులకు రాజీనామాలు చేసి వైదొలిగారు. అలాగే కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లు 12 నెలల నిషేధాన్ని ఎదుర్కొన్నారు. మరో బ్యాట్స్‌మెన్ కామరాన్ బాన్‌క్రాఫ్ట్ తొమ్మిది నెలల నిషేధానికి గురయ్యాడు, ఇలావుండగా రియోటింటో మైనింగ్ కంపెనీ కార్యనిర్వాహకుడైన పీవర్ గతవారం రెండోసారి క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయనపై పెద్దయెత్తున రాజీనామాకు వత్తిళ్లు వస్తున్నప్పటికీ తాను రాజీనామా చేసేదిలేదని తెగేసి చెబుతున్నారు.
ఐతే ఆరోపణల నుంచి బయటపడాలన్న ఆలోచన తనకుందని ప్రముఖ జాతీయ బ్రాడ్‌కాస్టర్ ఏబీసీకి ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొన్నారు. ఈయన వైఖరిని వ్యతిరేకించిన మాజీ ఆస్ట్రేలియా బౌలర్ జెఫ్ లాసన్ మాట్లాడుతూ క్రికెట్ క్రీడానుభవం కలిగిన వ్యక్తిని పీవర్ స్థానంలో చైర్మన్‌గా నియమించాలని డిమాండ్ చేశాడు.
మనకు ఇప్పుడు కావాల్సింది కార్పొరేట్ అనుభవం కలిగిన క్రికెట్ హెడ్ కాదు. క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకుని అనుభవాన్ని జోడించే హెడ్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ చర్చలోకి మాజీ ప్రధాన మంత్రి కెవిన్ రూడ్ సైతం ప్రవేశించారు. పీవర్ వెంటనే పదవికి రాజీనామా చేయాలని ట్వీటారు. మనదేశ గౌరవాన్ని బ్రష్టుపట్టించిన సంఘటనలన్నీ పీవర్ చైర్మన్‌గా ఉన్నకాలంలోనే జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఆటగాళ్లపై విధించిన నిషేధాన్ని సైతం ఎత్తివేయాలన్న డిమాండ్‌పై ఆస్ట్రేలియాక్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు గ్రెగ్ డయ్యర్ ఇక్కడ మాట్లాడుతూ ఈ విషయంలో ఆటగాళ్లు చాలాసమయాన్ని కోల్పోయారని, సంఘపరంగానూ వ్యతిరేకతను ఎదుర్కొన్నారని, అలాగే ఆర్థికపరంగా అత్యధిక పెనాల్టీలను ఎదుర్కొన్నారని అన్నారు. ఈవిషయంలో ఆటగాళ్లలో క్రీడాస్ఫూర్తిని, నీతిని నింపడంలో క్రికెట్ ఆస్ట్రేలియా పూర్తిగా విఫలమైందని అన్నారు. వ్యవహారాన్ని సరిదిద్దేందుకు మొత్తం 42 సిఫార్సులతో కూడిన 145 పేజీల నివేదికను వెంటనే అమలు చేయాలని ఆస్ట్రేలియా క్రికెట్ ఆసోసియేషన్ సూచించింది.