క్రీడాభూమి

పేసర్ ఖలీల్‌కు మందలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్: భారత క్రికెట్ జట్టులోని యువ పేసర్ ఖలీల్ అహమ్మద్ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ పడింది. ముంబయిలో భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన నాలుగో వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఖలీల్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ మార్లోన్ శామ్యూల్స్ 14వ ఓవర్‌లో ఔట్ అయిన సందర్భంలో ఖలీల్ అహమ్మద్ క్రీడా నిబంధనలకు విరుద్ధంగా అతిగా వ్యవహరించాడు. దీనిని శామ్యూల్స్ అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఈ విషయాలన్నింటినీ స్వయంగా గమనించిన ఫీల్డ్ అంపైర్లు రిఫరీకి ఫిర్యాదు చేశారు. ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఖలీల్ పొరపాటు చేసినట్టు రుజువు కావడంతో ఆర్టికల్ 2.5 కింద లెవెల్-1 ప్రకారం అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింటు విధించారు. కాగా, ఫీల్డ్ అంపైర్ల ఫిర్యాదుతో స్పంచిందిన రిఫరీ క్రిస్‌బ్రాడ్ ఖలీల్ అహమ్మద్‌ను మందలించాడు. మ్యాచ్ అయిన తర్వాత ఖలీల్ అహమ్మద్ తాను చేసిన తప్పును రిఫరీ క్రిస్ బ్రాడ్ ఎదుట అంగీకరించాడు. వాస్తవానికి ఏ క్రికెటర్ అయినా మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా ప్రత్యర్థి ఆటగాళ్ల పట్ల దురుసుగా, అసభ్యకరంగా వ్యవహరిస్తే అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడంతోపాటు ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లు విధిస్తారు. రెండేళ్ల కాలంలో ఆ క్రికెటర్‌కు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు పడితే అతనిపై నిషేధం విధించే అవకాశం కూడా ఉంటుంది. కాగా, వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో వనే్డలో ఎడమచేతివాటం పేసర్ ఖలీల్ అహమ్మద్ 5 ఓవర్లలో 13 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 224 పరుగుల భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.