క్రీడాభూమి

ఖతర్ వరల్డ్ కప్‌లో 48 జట్లు!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలాలంపూర్, అక్టోబర్ 31: ఖతర్‌లో 2022లో జరిగే ఫిఫా వరల్డ్ కప్‌లో కనీసం 40 టీమ్‌లు ప్రాతినిధ్యం వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో అన్నాడు. అయితే, ఈ విషయమై వచ్చే ఏడాది ప్రథమార్థంలో తుది నిర్ణయం జరుగుతుందని పేర్కొన్నాడు. ఇప్పటివరకు ఫిఫా వరల్డ్ కప్‌లో కేవలం 38 జట్లే పోటీ పడుతున్నాయి. కానీ 2022 ఖతర్ వరల్డ్‌కప్‌లో ఈ సంఖ్య మరింత పెరిగి 48 జట్లు ప్రాతినిధ్యం వహించే అవకాశాలు లేకపోలేదని స్పష్టం చేశాడు. 2026లో వరల్డ్ కప్ అమెరికా, కెనడా, మెక్సికోలో నిర్వహించేందుకు వీలున్నందున దానికంటే ముందు జరిగే ఖతర్ వరల్డ్ కప్‌లో పాల్గొనే జట్ల సంఖ్యను 48 వరకు పెంచుతామని కౌలాలంపూర్‌లో జరిగిన ఆసియా ఫుట్‌బాల్ కానె్ఫడరేషన్ వార్షిక కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడుతూ అన్నాడు. పెంచబోయే టీమ్‌ల సంఖ్య 2026 వరకు ఎందుకు? 2022లో ఎందుకు కాకూడదు? ఇందుకు అవకాశాలు ఎన్నో ఉన్నాయని వ్యాఖ్యానించాడు.