క్రీడాభూమి

భారత్ నుంచి ఎంతో నేర్చుకున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత కొనే్నళ్లలో తాము జరిపిన టూర్లలో భాగంగా భారత్‌లో పర్యటించిన నెల రోజుల్లో తాము ఎంతో నేర్చుకున్నామని వెస్టిండీస్ ఫీల్డింగ్ కోచ్ నిక్ పొథాస్ అన్నాడు. గురువారం తిరువనంతపురంలో భారత్-విండీస్ మధ్య వనే్డ సిరీస్‌లో ఆఖరి మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో బుధవారం ఇక్కడ మీడియాతో ఆయన మాట్లాడాడు. భారత్‌లో టెస్టు సిరీస్, వనే్డ సిరీస్‌లు ఆడేందుకు వచ్చిన తమ పర్యాటక జట్టుకు టీమిండియా ప్రత్యర్థి మాత్రమే కాదని అంటూ వారి నుంచి ఎంతో నేర్చుకుందని అన్నాడు. ‘టీమిండియా చాలా గొప్ప జట్టు. మేం కేవలం వారితో ఆడడానికే రాలేదు. వారి నుంచి ఎంతో నేర్చుకోవాలి. మంచి నైపుణ్యం గల జట్టుతో ఆడడానికి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలి’ అని అభిప్రాయపడ్డాడు. ఫైనల్ పోరులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్‌కెప్టెన్ రోహిత్ శర్మలను దెబ్బతీసేందుకు ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయన్న అంశంపై మాట్లాడుతూ..కేవలం వీరిద్దరిపైనే కాకుండా మొత్తం జట్టుపైనే తన గురి అని, ఇది అమలు చేసి తీరుతానని పేర్కొన్నాడు. టీమిండియాలో ప్రపంచ స్థాయి అగ్రశ్రేణి క్రీడాకారులు ఉన్నారని, వారిలో శిఖర్ ధావన్, అంబటి రాయుడు మంచి ఫామ్‌లో ఉన్నారని, మిగిలిన ఆటగాళ్లు కూడా బాగానే రాణిస్తున్నారని అన్నాడు. తమ జట్టులోని సభ్యులంతా యువ ఆటగాళ్లేనని, అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆడడం ద్వారా ఆటపై మంచి పట్టు సాధించేందుకు కృషి చేస్తున్నారని అన్నాడు. తమ జట్టు ఫీల్డింగ్‌లో అద్భుతంగా రాణిస్తోందని పేర్కొన్నాడు. ‘మా ఆటగాళ్లు మనుషులే..వారు రోబోట్స్ కాదు. ఒత్తిడిలో పొరపాట్లు జరుగుతుండవచ్చు. ఆటలో ఇది సహజం. అయినా ఆఖరి పోరులో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ఫీల్డింగ్ కోచ్ నిక్ పొథాస్ వ్యాఖ్యానించాడు.