క్రీడాభూమి

ఖలీల్ రాకతో బలపడిన బౌలింగ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీమిండియాలో ఎడమచేతివాటం కలిగిన యువ ఫాస్ట్-మీడియం బౌలర్ ఖలీల్ అహమ్మద్ జట్టులోకి రావడంతో బౌలింగ్ వ్యవస్థ మరింత బలపడిందని భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నాడు. ఇపుడు జట్టులో ఫాస్ట్‌బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారని, మిగిలిన జట్టు సభ్యులంతా ఆయా విభాగాల్లో సమర్థవంతంగా వ్యవహరిస్తున్నారని అన్నాడు. గురువారం భారత్-వెస్టిండీస్ మధ్య ఆఖరి వనే్డ జరుగనున్న నేపథ్యంలో ఆయన బుధవారం ఇక్కడ మీడియాతో కాసేపు ముచ్చటించాడు. టీమిండియాలో జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్‌తోపాటు యువ సంచలనం, ఖలీల్ రాకతో పేస్ బ్యాటరీ మరింత బలపడిందని వ్యాఖ్యానించాడు. 20 ఏళ్ల ఖలీల్ అహమ్మద్‌కు మంచి భవిష్యత్తు ఉందని, అంతర్జాతీయ క్రికెట్‌లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఇదే చక్కని వేదిక అని అన్నాడు. ముంబయిలో జరిగిన నాలుగో వనే్డలో ఖలీల్ అహమ్మద్ 13 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. జట్టులో ఫాస్ట్ బౌలింగ్ అవసరాన్ని కొనసాగిస్తునే ఆటగాళ్లపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు తరచూ బౌలర్లను మార్చాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించాడు. ఇదిలావుండగా, దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ గొప్ప క్రికెటర్ అని, అతని ఆటతీరు అందరికీ తెలిసిందేనని, రానున్న రోజుల్లో మళ్లీ ఫామ్‌లోకి వస్తాడని పేర్కొన్నాడు. యోయో టెస్టులో విఫలమైన హైదరాబాదీ ఆటగాడు అంబటి రాయుడు ఈ ఏడాది జరిగిన ఇంగ్లాండ్ టూర్‌లో చోటు దక్కించుకోలేకపోయినా ఇపుడు వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లలో బాగా రాణిస్తున్నాడని అన్నాడు.