క్రీడాభూమి

స్వదేశీ గడ్డలో మరో సిరీస్‌పై గురి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపుర: తిరువనంతపురం వేదికగా గురువారం జరిగే ఆఖరిది, ఐదు వనే్డలలో చివరి మ్యాచ్‌లో గెలుపు ద్వారా స్వదేశీ గడ్డపై మరో సిరీస్‌ను చేజిక్కించుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో కోహ్లీ సేన ఘన విజయం సాధించి నేపథ్యంలో మంచి ఊపుమీద ఉంది. వనే్డ సిరీస్‌లోనూ విజయం సాధించడం ద్వారా వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో జరిగే వరల్డ్ కప్‌లో మరింత ఉత్సాహంగా ఆడేందుకు టీమిండియా యోచిస్తోంది. ఐదు వనే్డల సిరీస్‌లో భాగంగా గౌహతిలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలుపొందగా, విశాఖపట్టణంలో జరిగిన రెండో వనే్డ టైగా ముగిసింది. పుణేలో జరిగిన మూడో వనే్డలో విండీస్ 43 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. ముంబయిలో జరిగిన నాలుగో వనే్డలో భారత్ 224 భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించింది. ఇప్పటికే జరిగిన నాలుగు వనే్డల్లో కోహ్లీ సేన ప్రత్యర్థిపై 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో గురువారం జరిగే ఆఖరి వనే్డలో ఎలాగైనా పైచేయి సాధించి వనే్డ సిరీస్‌ను కూడా ముద్దాడాలని భారత్ యోచిస్తోంది. మరోపక్క టెస్టు సిరీస్‌ను కోల్పోయినా ఆఖరి వనే్డలో గెలుపు ద్వారా వనే్డ సిరీస్‌ను సమం చేస్తే కనీసం పరువు కొంతవరకైనా దక్కుతుందని జాసన్ హోల్డర్ నాయకత్వంలోని విండీస్ ఆశపడుతోంది. ఇదిలావుండగా, టీమిండియాలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్‌కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. గడిచిన నాలుగు వనే్డలలో కోహ్లీ మూడు సెంచరీలు నమోదు చేయగా, రోహిత్ శర్మ రెండు శతకాలు చేశాడు. అంతేకాకుండా టీమిండియా కెప్టెన్ ఆశలను వమ్ము చేయకుండా హైదరాబాదీ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు సైతం జట్టులో రాణిస్తున్నాడు. ముంబయిలో జరిగిన నాలుగో వనే్డలో రాయుడు సెంచరీ చేశాడు. అయితే, జట్టులోని మిగిలిన బ్యాట్స్‌మెన్‌ల పరిస్థితే ఆందోళనకరంగా ఉంది. ఓపెనర్ శిఖర్ ధావన్, సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ ఆటతీరు కూడా అంతంతమాత్రమే. ఇక బౌలర్లలో రెండు వనే్డల అనంతరం జట్టులోకి వచ్చిన జస్ప్రీత్ బుమ్రా, యువ పేసర్ ఖలీల్ అహమ్మద్ ఆడిన రెండు మ్యాచ్‌లలో ఆకట్టుకునేలా వికెట్లను పడగొట్టారు. గురువారం జరిగే ఆఖరి మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ తన మునుపటి ఫామ్‌ను కొనసాగిస్తాడని కోహ్లీ బలంగా విశ్వసిస్తున్నాడు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, రవీంద్ర జడేజా వంటివారు సైతం ఫైనల్ పోరులో తమ సత్తా చూపిస్తారని జట్టు యాజమాన్యం యోచిస్తోంది. ఇక మరోపక్క వనే్డ సిరీస్‌లో ఇప్పటికే ఆధిక్యంలో ఉన్న టీమిండియాకు ఆఖరి మ్యాచ్‌లో గట్టి పోటీ ఇచ్చేందుకు జాసన్ హోల్డర్ కెప్టెన్సీలోని కరేబియన్ సేన గట్టిగా పోరాడేందుకు సమాయత్తమవుతోంది. పుణేలో జరిగిన మూడో వనే్డలో భారత స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొని విజయం సాధించిన తరహాలోనే ఆఖరి మ్యాచ్‌లోనూ వ్యవహరించాలని జట్టు సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా షిమ్రాన్ హెట్‌మెయిర్, షాయ్ హోప్ వంటివారిపై కెప్టెన్ జాసన్ హోల్డర్ గట్టి నమ్మకంతో ఉన్నాడు. క్రీజులో వీరిద్దరూ స్థిరంగా నిలబడితే వనే్డ సిరీస్‌ను సమం చేయవచ్చునని యాజమాన్యం యోచిస్తోంది.