క్రీడాభూమి

సీఏ చైర్మన్ పీవెర్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, నవంబర్ 1: ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లినప్పుడు చోటుచేసుకున్న బాల్ ట్యాంపరింగ్ సంఘటన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)ను ఇబ్బందిపెడుతూనే ఉంది. ఏకంగా చైర్మన్ డేవిడ్ పీవెర్ రాజీనామాకు దారితీసింది. ట్యాంపరింగ్ సంఘటన నేపథ్యంలోనే, అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, వారి ఆదేశాలతో బంతి ఆకారాన్ని మార్చడానికి ప్రయత్నించిన బ్యాట్స్‌మన్ కామెరన్ బాన్‌క్రాఫ్ట్‌పై సస్పెన్షన్ వేటు పడింది. చీఫ్ కోచ్ డారెన్ లీమన్ కూడా తన పదవికి రాజీనామా చేశాడు. కాగా, ఇటీవలే రెండు దర్యాప్తు సంస్థలు విడివిడిగా ఈ సంఘటనపై విచారణ జరిపి సమర్పించిన నివేదిక సీఏను మరింత ఇరుకున పెట్టినట్టు సమాచారం. ఇలావుంటే, ఆ సంఘటన చాలా చిన్నదని వ్యాఖ్యానించిన పీవెర్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. సీఏ నిర్లిప్తంగా వ్యవహరించడం వల్లే ఆసీస్ క్రికెటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, వారిపై ఎవరి ఆజమాయిషి లేకపోయిందని నివేదికలు స్పష్టం చేసిన తర్వాత కూడా పీవెర్ ఈ విధంగా మాట్లాడడం ఏమిటన్న ప్రశ్న వినిపిస్తున్నది. దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తం కావడంతో, పీవెర్ తన పదవికి రాజీనామా చేశాడు.