క్రీడాభూమి

కోహ్లీ, కుల్దీప్‌టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య జరిగిన వనే్డ ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్ టాపర్లుగా నిలిచారు. కోహ్లీ 5 మ్యాచ్‌లు ఆడి, రెండు పర్యాయాలు నాటౌట్‌గా నిలిచి, మొత్తం 453 పరుగులు సాధించాడు. అజేయంగా 157 పరుగులు అతని అత్యధిక స్కోరు. రోహిత్ శర్మ ఐదు మ్యాచ్‌ల్లో (రెండు నాటౌట్లు) 389 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 162 పరుగులు. షిమ్రన్ హేత్‌మేయర్ ఐదు మ్యాచ్‌ల్లో 259. టాప్ స్కోరు 106 పరుగులు. షాయ్ హోప్ ఐదు ఇన్నింగ్స్‌లో ఒకసారి నాటౌట్‌గా నిలిచి 250 పరుగులు. 123 (నాటౌట్) అతని అత్యధిక స్కోరు. అంబటి రాయి ఐదు మ్యాచ్‌లు ఆడి, ఒకసారి నాటౌట్‌గా నిలిచి 217 పరుగులు సాధించాడు. అతని త్యధిక స్కోరు 100 పరుగులు. కాగా, బౌలింగ్ విభాగంలో, నాలుగు మ్యాచ్‌లు ఆడని కుల్దీప్ యాదవ్ తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. 42 పరుగులకు మూడు వికెట్లు అతని అత్యుత్తమ ప్రదర్శన. ఖలీల్ అహ్మద్ నాలుగు మ్యాచ్‌ల్లో 7, రవీంద్ర జడేజా నాలుగు మ్యాచ్‌ల్లో 7 చొప్పున వికెట్లు కూల్చారు. జస్‌ప్రీత్ బుమ్రా మూడు మ్యాచ్‌ల్లో ఆరు, యుజువేంద్ర చాహల్ మూడు మ్యాచ్‌ల్లో ఐదు, ఆష్లే నర్స్ 4 మ్యాచ్‌ల్లో 5 చొప్పున వికెట్లు సాధించారు.