క్రీడాభూమి

సిరీస్ తిప్పేశారు.... గెలిచేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం: వెస్టిండీస్‌తో గురువారం జరిగిన చివరి, ఐదో వనే్డలో భారత్ తిరుగులేని విజయాన్ని నమోదు చేసి, సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా విసిరిన స్పిన్ పంజాకు విండీస్ విలవిల్లాడింది. 31.5 ఓవర్లలో కేవలం 104 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా శిఖర్ ధావన్ వికెట్‌ను కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నాలుగు వికెట్లు సాధించి, విండీస్ పతనానికి కారణమైన జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ మొదటి ఓవర్ నాలుగో బంతికే కీరన్ పావెల్ (0) వికెట్‌ను కోల్పోయింది. వికెట్‌కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ క్యాచ్ పట్టగా భువనేశ్వర్ కుమార్ అతని వికెట్‌ను సాధించాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన వికెట్‌కీపర్ షాయ్ హోప్ ఐదు బంతులు ఎదుర్కొన్నప్పటికీ, ఒక్క పరుగు కూడా చేయకుండానే జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆరంభంలోనే రెండు వికెట్లు చేజార్చుకున్న వెస్టిండీస్‌ను ఆదుకోవడానికి రోవ్‌మన్ పావెల్, మార్లొన్ శామ్యూల్స్ కొంత సేపు కష్టపడ్డారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 34 పరుగులు జోడించారు. 38 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 24 పరుగులు చేసి, ప్రమాదకంగా కనిపించిన మార్లొన్ శామ్యూల్స్‌ను కోహ్లీ క్యాచ్ అందుకోగా జడేజా పెవిలియన్‌కు పంపాడు. షిమ్రన్ హేత్‌మేయర్ 9 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్‌బీగా వెనుదిరిగాడు. తర్వాత కొంత సేపటికే రోవ్‌మన్ పావెల్ ఇన్నింగ్స్ కూడా ముగిసింది. క్రీజ్‌లో నిలదొక్కుకోవడానికి విఫలయత్నం చేసిన అతను 39 బంతుల్లో, ఒక ఫోర్‌తో 18 పరుగులు చేసి, ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్ క్యాచ్ అందుకోగా ఔటయ్యాడు. ఆతర్వాత ఫాబియన్ అలెన్ కేవలం నాలుగు పరుగులకే వెనుదిరగ్గా, ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తన భుజాలపై వేసుకొని, 33 బంతుల్లో, రెండు ఫోర్లతో 25 పరుగులు చేసిన కెప్టెన్ జాసన్ హోల్డర్‌ను ఖలీల్ అహ్మద్ ఔట్ చేశాడు. కేదార్ జాదవ్ అందుకున్న చక్కటి క్యాచ్ హోల్డర్ ఇన్నింగ్స్‌కు తెరదింపింది. కీమో పాల్ (5), కెమెర్ రోచ్ (5), ఒషాన్ థామస్ (0) తక్కువ స్కోర్లకే పరిమితం కావడంతో, వెస్టిండీస్ ఇన్నింగ్స్ 3105 ఓవర్లలో 104 పరుగులకే ముగిసింది. చివరిలో దేవేంద్ర బిషూ ఎనిమిది పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మొత్తం మీద విండీస్ ఇన్నింగ్స్‌లో రోవ్‌మన్ పావెల్, మార్లొన్ శామ్యూల్స్, జాసన్ హోల్డర్ తప్ప మిగతా వారెవరూ కనీసం రెండంకెల స్కోర్లు కూడా చేయలేకపోవడం గమనార్హం. జడేజా 34 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టగా, జస్‌ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్ చెరి రెండు వికెట్లు సాధించారు. భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్ చెరొక వికెట్‌ను తమ ఖాతాల్లో వేసుకున్నారు.

స్కోరు బోర్డు
==========
వెస్టిండీస్ ఇన్నింగ్స్: కీరన్ పావెల్ సీ మహేంద్ర సింగ్ ధోనీ బీ భువనేశ్వర్ కుమార్ 0, రోవ్‌మన్ పావెల్ సీ శిఖర్ ధావన్ బీ ఖలీల్ అహ్మద్ 15, షాయ్ హోప్ బీ జస్‌ప్రీత్ బుమ్రా 0, మార్లొన్ శామ్యూల్స్ సీ విరాట్ కోహ్లీ బీ రవీంద్ర జడేజా 24, షిమ్రన్ హేత్‌మేయర్ ఎల్‌బీ రవీంద్ర జడేజా 9, జాసన్ హోల్డర్ సీ కేదార్ జాదవ్ బీ ఖలీల్ అహ్మద్ 25, ఫాబియన్ అలెన్ సీ కేదర్ జాదవ్ బీ జస్‌ప్రీత్ బుమ్రా 4, కీమో పాల్ సీ అంబటి రాయుడు బీ కుల్దీప్ యాదవ్ 5, దేవేంద్ర బిషూ 8 నాటౌట్, కెమెర్ రోచ్ సీ కేదార్ జాదవ్ బీ రవీంద్ర జడేజా 5, ఒషాన్ థామస్ ఎల్‌బీ రవీంద్ర జడేజా 0, ఎక్‌స్ట్రాలు 8, మొత్తం (31.5 ఓవర్లలో ఆలౌట్) 104.
వికెట్ల పతనం: 1-1, 2-2, 3-36, 4-53, 5-57, 6-66, 7-87, 8-94, 9-103, 10-104.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 4-1-11-1, జస్‌ప్రీత్ బుమ్రా 6-1-11-2, ఖలీల్ అహ్మద్ 7-1-29-2, రవీంద్ర జడేజా 9.5-1-34-4, కుల్దీప్ యాదవ్ 5-1-18-1.