క్రీడాభూమి

రన్ మిషన్ మరో రికార్డు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* గంగూలీ, యువరాజ్ రికార్డును సమం చేసిన కోహ్లీ
* సచిన్ తెండూల్కర్, జయసూర్య రికార్డుకు చేరువలో టీమిండియా కెప్టెన్
న్యూఢిల్లీ, నవంబర్ 2: వనే్డ ఇంటర్నేషన్ మ్యాచ్‌లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏడుసార్లు మ్యాన్ ఆఫ్ సిరీస్ అవార్డులు కైవసం చేసుకున్న ఘనతను సాధించాడు. గురువారం తిరువనంతపురంలో వెస్టిండీస్‌తో జరిగిన చివరి వనే్డలో భారత్ 9 వికెట్ల తేడాతో గెలుపొందిన అనంతరం కోహ్లీ కెప్టెన్ హోదాలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఏడోసారి అందుకున్నాడు. ఏడోసారి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కైవసం చేసుకోవడం ద్వారా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అందుకున్న అవార్డులతో సమం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఏడుసార్లు మ్యాన్ ఆఫ్ సిరీస్ అవార్డులు దక్కించుకున్నవారిలో వివియన్ రిచర్డ్స్, రికీ పాంటింగ్, హషీమ్ ఆమ్లా ఉన్నారు. కాగా, ఇప్పటివరకు వనే్డ మ్యాచ్‌లలో అత్యధికంగా మ్యాన్ ఆఫ్ సిరీస్‌లు అందుకున్నవారిలో దిగ్గజ ఆటగాళ్లు భారత్ నుంచి సచిన్ తెండూల్కర్ (15సార్లు), శ్రీలంక నుంచి సనత్ జయసూర్య (11సార్లు), దక్షిణాఫ్రికా నుంచి షాన్ పొలాక్ (9సార్లు) ఉన్నారు. కాగా, వెస్టిండీస్‌తో జరిగిన ఐదు వనే్డ ఇంటర్నేషనల్ సిరీస్‌లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 453 పరుగులు చేశాడు.