క్రీడాభూమి

బోల్ట్ కలలు గల్లంతు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, నవంబర్ 2: ఏడాది కిందట పరుగు పందానికి ఫుల్‌స్టాప్ చెప్పిన పరుగుల రారాజు ఉసేన్ స్ప్రింట్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా ఎదగాలనుకుంటున్న కలలు గల్లంతుకానున్నాయి. అతనితో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ చర్చలు విఫలం కావడంతో ఆస్ట్రేలియా సెంట్రల్ కోస్ట్ మారినర్స్‌తో కుదుర్చుకున్న ట్రయల్ పీరియడ్‌ను రద్దు చేసుకుంది. ఎనిమిదిసార్లు ఒలింపిక్ చాంపియన్‌గా అవతరించిన బోల్డ్ గత ఏడాది కాలంగా పరుగుపందాలకు దూరంగా ఉంటున్నాడు. పరుగు పోటీ నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్టు అప్పట్లోనే ప్రకటించి సంచలనం సృష్టించాడు. తాను కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నానని అంటూ ఆ తర్వాత రోజుల్లో ఫుట్‌బాల్ వైపు దృష్టి సారించనున్నట్టు ప్రకటించాడు. ఈ ఏడాది ఆగస్టులో ఆస్ట్రేలియా-ఏ లీగ్ తరఫున బరిలోకి దిగాడు. చిన్ననాటి కల అయిన సాకర్ ఆటగాడిగా రాణించాలని అనుకున్నా పరుగుల యంత్రంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. ఆస్ట్రేలియా సెంట్రల్ కోస్ట్ మారినర్స్‌లో చోటు దక్కించుకున్న బోల్ట్‌కు 2.1 మిలియన్ డాలర్లను క్లబ్ ఆఫర్ చేసింది. అయితే, వాణిజ్యపరమైన అంశాల్లో సహకరిస్తామని భరోసా ఇచ్చిన భాగస్వామ్య పార్టీలతోపాటు జరిపిన చర్చలు ఆశాజనకంగా కనిపించని నేపథ్యంలో ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా ఎదగాలనుకుంటున్న బోల్డ్ ఆశలు అడియాసలయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది