క్రీడాభూమి

ఒలింపిక్‌లో గోల్డ్‌మెడల్ దిశగా బజరంగ్‌ను తీర్చిదిద్దుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొహానా (సోనేపట్), నవంబర్ 2: తన అభిమాన శిష్యుడు బజరంగ్ పూనియాను రానున్న ఒలింపిక్ పోటీల్లో గోల్డ్‌మెడల్ సాధించే దిశగా తీర్చిదిద్దుతానని ప్రముఖ రెజ్లర్ యోగేశ్వర్‌దత్ అన్నాడు. 2012 లండ న్ గేమ్స్‌లో భారత్‌కు కాంస్య పతకం అం దించిన మూడో రెజ్లర్‌గా ఘనత వహించిన హర్యానాకు చెందిన యోగేశ్వర్‌దత్ 2020 టోక్యో ఒలింపిక్స్ వరకు తాను కొనసాగే అవకాశం లేదని స్పష్టం చేశాడు. 2014 ఆసియా గేమ్స్‌తోపాటు కామనె్వల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్స్ దక్కించుకున్న యోగేశ్వర్‌దత్ ఇపు డు తన దృష్టంతా బజరంగ్ పూనియాపైనే అని స్పష్టం చేశాడు. వచ్చే ఒలింపిక్స్‌లో రెజ్లంగ్‌లో భారత్‌కు తప్పనిసరిగా గోల్డ్‌మెడల్ అందించే సత్తా ఉన్నవాడిలో బజరంగ్ కూడా ఉంటాడని అంటూ అతని కృషి, పట్టుదలను కొనియాడాడు. ఇపుడు తన వయసు 35 అని, ఇప్పటికే ఎన్నో పోటీల్లో పాల్గొని భారత్‌కు ఎన్నో పతకాలు అందించానని, 24 ఏళ్ల బజరంగ్‌కు ఎంతో భవిష్యత్తు ఉందని అన్నాడు. తాను ఇప్పటివరకు 65 కేజీల విభాగంలోనే పోటీ పడ్డానని, 70 కేజీల విభాగంలో పోటీ పడేందుకు అవకాశాలు వచ్చినా పాల్గొనలేకపోయానని అన్నాడు. అయితే, బజరంగ్ పూనియా ఇప్పటికే 65 కేజీల విభాగంలో పోటీ పడినందున భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదిగేందుకు అతనికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని అన్నాడు.