క్రీడాభూమి

ఆధారాలు లేకే ఫిక్సింగ్‌పై దర్యాప్తులో జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 2: సరైన ఆధారాలు లేకపోవడం వల్లే స్పాట్ ఫిక్సింగ్‌పై జరుగుతున్న దర్యాప్తును పూర్తి చేయలేకపోతున్నామని ఐపీఎల్-2013 సీజన్‌లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్‌పై దర్యాప్తు చేస్తున్న జస్టిస్ ముకుల్ ముద్గల్ ప్యానెల్‌లో సభ్యుడు, మాజీ ఐపీఎస్ అధికారి బీబీ మిశ్రా అన్నాడు. ఆ సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు చెందిన సీనియర్ క్రికెటర్-బుకీ మధ్య చర్చలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై అప్పటినుంచి దర్యాప్తు జరుగుతోంది. అయితే, ఇప్పటివరకు దర్యాప్తు పూర్తికాకపోవడానికి క్రికెటర్-బుకీల మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన సరైన ఆధారాలు లభ్యం కాకపోవడంతోనే దర్యాప్తు పూర్తి చేయడంలో జాప్యం జరుగుతోందని భువనేశ్వర్‌లో పీటీఐ ప్రతినిధితో మాట్లాడుతూ మిశ్రా వ్యాఖ్యానించాడు. దర్యాప్తులో భాగంగా బుకీ నుంచి తగిన ఆధారాలు కోరడంతో అందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన విషయాన్ని పేర్కొన్నాడు. అయితే, స్పాట్ ఫిక్సింగ్ వెనుక అనేకమందికి ప్రమేయం ఉండడం, వారివల్ల తన ఉనికికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందన్న కారణంతోనే సదరు బుకీ ఆ ఆధారాలు తమకు అందజేయడానికి నిరాకరిస్తున్నాడని అన్నాడు. ఎనిమిది మంది ఆటగాళ్లకు ఈ స్పాట్ ఫిక్సింగ్‌తో సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ ముద్గల్ కమిటీ సుప్రీంకోర్టుకు సీల్డ్ ఎన్వలప్ అందజేసిన విషయాన్ని పేర్కొన్నాడు. దర్యాప్తునకు సంబంధించిన పలు కీలక అంశాలను బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ చీఫ్ అజిత్ సింగ్‌తో పంచుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు.