క్రీడాభూమి

ఐసీసీ వనే్డ ర్యాంకింగ్స్ విరాట్ కోహ్లీ, రోహిత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఐసీసీ తాజాగా ప్రకటించిన వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల ర్యాంకింగ్స్ (బ్యాటింగ్)లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్‌కెప్టెన్ రోహిత్ శర్మ తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఈ ఏడాది ఇప్పటివరకు కోహ్లీ ఆడిన 14 మ్యాచ్‌లలో 1202 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 871 పరుగులు చేశాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ 899 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, తన కెరీర్‌లో అత్యధికంగా 871 పాయింట్లతో రోహిత్ శర్మ రెండో స్థానం దక్కించుకుని కెప్టెన్‌కు చేరువయ్యాడు. వెస్టిండీస్‌తో జరిగిన వనే్డ సిరీస్‌లో కోహ్లీ 10వేల పరుగుల మైలురాయిని చేరుకుని దిగ్గజ ఆటగాడు సచిన్ తెండూల్కర్ రికార్డును అధిగమించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో కోహ్లీ 453 పరుగులు చేశాడు. కాగా, టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 4 స్థానా లు దిగజారి 38వ స్థానంలో నిలబడ్డాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ 807 పాయింట్లతో 3వ స్థానంలో చోటుదక్కించుకున్నాడు. బాబర్ అజామ్, రాస్ టేలర్, కేన్ విలియమ్సన్, క్వింటన్ డికాక్ వరుసగా 5, 6, 7, 8 స్థానాల్లో చోటుదక్కించుకున్నారు.
ఇక ఐసీసీ బౌలింగ్ జాబితాలో టీమిండియాకు చెందిన యుజ్వేంద్ర చాహల్, రవీంద్ర జడేజా తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో ఉత్తమ ర్యాంకులు సాధించారు. రవీంద్ర జడేజా 16 స్థానాలు ఎగబాకి 25వ ర్యాంక్, యుజ్వేంద్ర చాహల్ మూడు స్థానాలు ఎగబాకి తొలిసారిగా 10వ ర్యాంక్‌లో చోటు దక్కించుకున్నారు. జస్ప్రీత్ బుమ్రా 841 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.