క్రీడాభూమి

ఫేవరిట్‌గా టీమిండియా.. అయినా.. ఫోటీ పడేందుకు వెనుకాడం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 3: టీ-20లో ఇప్పటికే రెండుసార్లు వరల్డ్ చాంపియన్‌గా అవతరించిన టీమిండియా ఇటీవల జరిగిన టెస్టు సిరీస్, వనే్డ సిరీస్‌లలో తమపై పూర్తి ఆధిపత్యం చెలాయించి ఇపుడు టీ-20లో ఫేవరిట్‌గా బరిలోకి దిగుతున్నా పోటీపడేందుకు తాము వెనుకాడబోమని వెస్టిండీస్ కెప్టెన్ కార్లోస్ బ్రాత్‌వైట్ అన్నాడు. ఆదివారం భారత్-వెస్టిండీస్ మధ్య తొలి టీ-20 ఇంటర్నేషనల్ జరుగనున్న నేపథ్యంలో శనివారం ఇక్కడ మీడియా ప్రతినిధులతో బ్రాత్‌వైట్ మాట్లాడాడు. వాస్తవానికి భారత్‌తో జరిగిన టీ-20 సిరీస్‌లలో ఇప్పటివరకు తమదే ఆధిపత్యమైనా దిగ్గజ ఆటగాళ్లతో బరిలోకి దిగుతున్న ఆ జట్టు సిరీస్ ఫేవరిట్‌గా బరిలోకి దిగుతోందని అన్నాడు. టీమిండియాతో టెస్టు సిరీస్, వనే్డ సిరీస్‌లను కోల్పోవడం సిగ్గుగా ఉందని వ్యాఖ్యానించిన ఆయన తమ జట్టులో దాదాపు అంతా కొత్త ముఖాలైనా కొందరు ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచారని అన్నాడు. వనే్డలలో తాము అనుకున్నదానికంటే బాగా రాణించారని యువ క్రికెటర్లను కొనియాడాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ మహేంద్ర సింగ్ ధోనీ టీ-20 సిరీస్‌లో లేకున్నా ఆ జట్టును తాము తక్కువగా అంచనా వేయలేమని వ్యాఖ్యానించాడు.
నెట్ ప్రాక్టీస్‌కు రసెల్ మిస్
వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రసెల్ శనివారం జరిగిన నెట్ ప్రాక్టీస్‌కు హాజరు కాకపోవడంతో ఆదివారం భారత్‌తో జరిగే తొలి టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో అతను ఆడతాడా? లేదా? అన్న అనుమానాలు ఉన్నాయి. దుబాయి నుంచి భారత్‌కు వచ్చే విమానం మిస్ కావడంతో తొలి టీ-20పై అతని ప్రాతనిధ్యంపై ఇప్పుడే తామేమీ వ్యాఖ్యలు చేయబోమని విండీస్ మీడియా మేనేజర్ మొయిన్ బిన్ మక్సూద్ ఇక్కడి మీడియాతో అన్నాడు.