క్రీడాభూమి

ధోనీ లేకుండానే టీ-20 సిరీస్‌కు భారత్ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 3: భారత్‌కు రెండుసార్లు వరల్డ్ కప్ ట్రోఫీలు అందించిన మహేంద్ర సింగ్ ధోనీ లేకుండానే వెస్టిండీస్‌తో జరిగే మూడు టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు భారత్ సిద్ధమవుతోంది. ఆదివారం వెస్టిండీస్‌తో కోల్‌కతాలో తొలి టీ-20 మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో సీనియర్ ఆటగాడు లేని లోటు జట్టులో ప్రస్ఫుటంగా కనిపించనుంది. వాస్తవానికి వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో జరిగే మూడేసి టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు ధోనీని పక్కన పెట్టాలని ఇటీవల భారత క్రికెట్ బోర్డు చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ నిర్ణయించిన విషయం తెలిసిందే. కేవలం టీ-20 మ్యాచ్‌ల నుంచి ధోనీని తప్పించడం వల్ల ఈ విభాగంలో అతని కెరీర్ ముగిసినట్టు కాదని సెలక్టర్ల కమిటీ పేర్కొంది. భవిష్యత్తులో ధోనీకి ఎన్నో అవకాశాలు ఉన్నాయని కమిటీ చెప్పకనే చెప్పింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ధోనీ తనను తాను త్యాగం చేసుకున్నాడని అంటూ టీ-20ల నుంచి అతనిని తప్పించాలనేది సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయమని ఒక సందర్భంగా వ్యాఖ్యానించాడు.
ఇదిలావుండగా వెస్టిండీస్‌తో జరిగే మూడు టీ-20 మ్యాచ్‌ల నుంచి విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చారు. రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం ద్వారా భారత్‌ను చాంపియన్‌గా నిలిపేందుకు కీలక భూమిక పోషించే దిశగా అడుగులు వేయాల్సి ఉంటుందని క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్, వనే్డ ఇంటర్నేషనల్ సిరీస్‌లలో ఘన విజయాలను నమోదు చేసుకున్న టీమిండియా టీ-20 సిరీస్‌పై కూడా కనే్నయడం ద్వారా కరేబియన్లను మూడు సిరీస్‌లలో వైట్‌వాష్ చేసే దిశగా పావులు కదుపుతోంది. అయితే, భారత్‌కు టెస్టు సిరీస్, వనే్డ సిరీస్‌లు గెలుచుకున్నంతగా టీ-20లో గెలుపు అంత సులభం కాదని పరిశీలకులు పేర్కొంటున్నారు. టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్, వనే్డ సిరీస్‌లలో మిస్ అయిన వెస్టిండీస్ ఆటగాళ్లలో బాగా పేరున్న స్టార్ క్రికెటర్లు డారెన్ బ్రేవో, కీరోన్ పొలార్డ్, ఆండ్రూ రస్సెల్ వంటివారు టీ-20 సిరీస్‌లో సత్తా చూపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ముగ్గురికి ఐపీఎల్‌లో భారత్‌లో వివిధ ఫ్రాంచైజీలతో ప్రాతినిధ్యం వహించిన అపార అనుభవం ఉంది. ఈ ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు 2009-2017 వరకు ఆడిన టీ-20 మ్యాచ్‌లలో రికార్డు సృష్టించిన చరిత్ర ఉంది. కాగా, టీమిండియాతో జరిగే టీ-20 సిరీస్‌కు విండీస్ కెప్టెన్‌గా కార్లోస్ బ్రాత్‌వైట్ వ్యవహరించనున్న నేపథ్యంలో పోటీ తీవ్రంగా ఉండే అవకాశం లేకపోలేదు. ఇప్పటివరకు విండీస్‌తో ఐదుసార్లు తలపడిన భారత్ మూడుసార్లు ఓటమిని చవిచూసింది. 2016లో వరల్డ్ టీ-20 సెమీఫైనల్స్‌లో భారత్‌ను ఓడించింది. 2016లో టీ-20 వరల్డ్ కప్‌ను సైతం వెస్టిండీస్ చేజిక్కించుకుంది. అయితే, అప్పటికీ, ఇప్పటికీ ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చిన నేపథ్యంలో స్వదేశంలో టీ-20 సిరీస్ టైటిల్‌ను చేజిక్కించుకోవడం ద్వారా గతంలో ఇదే గడ్డపై తమ జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటామని రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్ యోచిస్తోంది. వెస్టిండీస్ తమ జట్టులో యువ బ్యాట్స్‌మన్ షిమ్రాన్ హెట్‌మెయిర్‌పై ఎక్కువగా దృష్టి సారించింది. వనే్డ సిరీస్‌లో మొత్తం 259 పరుగులు సాధించిన అతను గౌహతిలో జరిగిన వనే్డ మ్యాచ్‌లో సెంచరీ చేసిన విషయం తెలిసిందే. కోహ్లీ స్థానే కేఎల్ రాహుల్, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్‌తోపాటు మిడిలార్డర్‌లో కృణాల్ పాండ్య దిగే అవకాశం ఉంది. వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్ని యువ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ భర్తీ చేస్తాడని జట్టు యాజమాన్యం బలంగా నమ్ముతోంది. బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహమ్మద్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ వంటివారు ఇటు పేస్, అటు స్పిన్‌తో జట్టుకు మేలు చేకూరుస్తారని జట్టు విశ్వసిస్తోంది.