క్రీడాభూమి

రోజ్‌ను గెంటేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, మే 2: వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఫ్రాంక్లిన్ రోజ్‌ను న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు గెంటేశారు. అనుమతించిన కాలం పూర్తయినప్పటికీ, అనధికారికంగా న్యూజిలాండ్‌లో ఉంటున్న అతనిపై కేసు నడిచింది. ఐదు వారాల శిక్షను అనుభవించి జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే అధికారులు అతనిని జమైకా విమానం ఎక్కించారు. కెరీర్‌లో 19 టెస్టులు, 27 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడిన 44 ఏళ్ల రోజ్ 2011లో అక్లాండ్ యూనివర్శిటీ క్రికెట్ క్లబ్‌కు శిక్షణ ఇచ్చేందుకు కాంట్రాక్టు కుదుర్చుకొని, న్యూజిలాండ్ ప్రభుత్వం నుంచి వర్క్ వీసాను సంపాదించాడు. అతని వీసా గడువు 2012తో ముగిసింది. అయితే, ఆక్లాండ్‌లోని కొన్ని పాఠశాలల్లో ప్రైవేటుగా శిక్షణనిస్తూ అతను అనధికారికంగా అక్కడే ఉండిపోయాడు. తక్షణమే దేశం విడిచి వెళ్లిపోవాల్సిందిగా 2014లో న్యూజిలాండ్ ప్రభుత్వం ఆదేశించినప్పటికీ అతను పట్టించుకోలేదు. గత నెల అతనిని అరెస్టు చేసిన అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు తీర్పు ప్రకారం ఆక్లాండ్ వౌంట్ ఈడెన్ జైలులో ఐదు వారాల శిక్షను అనుభవించిన రోజ్‌ను కొన్ని గంటల్లోనే అక్కడి నుంచి అతని స్వదేశానికి పంపారు. వర్క్ వీసాను పొడిగించాలని అతను చేసిన విజ్ఞప్తిని న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ మంత్రి క్రెగ్ ఫాస్ తిరస్కరించాడు.