క్రీడాభూమి

ఫలించనున్న చిరకాల ‘స్వప్న’ం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పుట్టుకతోనే రెండు కాళ్లకు ఆరేసి వేళ్లు కలిగిన ఆసియా గేమ్స్ గోల్డ్ మెడల్ సాధించిన స్వప్న బర్మన్‌కు త్వరలో ఏడు జతల షూలు సమకూరనున్నాయి. ఈ ఏడాది ప్రథమార్ధంలో జకార్తాలో జరిగిన ఆసియా గేమ్స్‌లో హెప్ట్థ్లాన్ విభాగంలో భారత్‌కు గోల్డ్ మెడల్ అందించిన తొలి అథ్లెట్‌గా ఖ్యాతి గడించింది. స్వప్న ఆర్థిక పరిస్థితులను మీడియా ద్వారా తెలుసుకున్న ప్రసిద్ధ షూల తయారీ సంస్థ ఆడిడాస్ ఆమె కాళ్లకు సరిపడా షూలు అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం ఎంత ఖర్చు అయినా భరిస్తామని ఇటీవల ఆ సంస్థ వెల్లడించింది. ఇందులో భాగంగానే స్వప్న కాళ్లకు సరిపడా షూల తయారీలో గత రెండు నెలలుగా భారత అధికారులతోపాటు, అథ్లెట్ సర్వీస్‌లు అందించే జర్మనీలోని సంబంధిత ల్యాబ్‌లతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది. ఈ నేపథ్యంలో స్వప్న కాళ్లకు సరిపడా ఏడురకాల షూలు తమ బ్రాండ్ ద్వారా అందించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. క్రీడాకారులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామని, ఇందుకు స్వప్న వంటివారిని తమ ఆడిడాస్ కుటుంబంలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని సంస్థ సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్ సియన్ వాన్ వైక్ తెలిపాడు. కాగా, ఒక క్రీడాకారిణిగా ఆడిడాస్ సంస్థ అందించే ఉదార సహాయాన్ని స్వీకరించేందుకు తద్వారా ఆ సంస్థ కుటుంబంలో ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వంగా ఉందని స్వప్న ఆనందం వ్యక్తం చేసింది. తన తదుపరి లక్ష్యం ఒలింపిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించడమేనని, ఇందుకు ఆడిడాస్ సంస్థ అందించే సంపూర్ణ మద్దతుతో ముందుకు సాగుతానని గట్టి నమ్మకాన్ని, ధీమాను వ్యక్తం చేసింది.

చిత్రం..స్వప్న బర్మన్