క్రీడాభూమి

చరిత్ర సృష్టించిన హెరాత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీలంక: శ్రీలంక-ఇంగ్లాండ్ మధ్య ఇక్కడి గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మంగళవారం ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక స్పిన్నర్, సీనియర్ ఆటగాడు రంగనా హెరాత్ చరిత్ర సృష్టించాడు. ఈ మైదానంలో వంద వికెట్లకు ఒక వికెట్ దూరంలో ఉన్న హెరాత్ మంగళవారం ఈ రికార్డును సాధించాడు. తమ దేశంలో 100 వికెట్లు తీసిన రెండో టెస్టు క్రికెటర్‌గా రికార్డు పుటల్లో చోటుదక్కించుకున్నాడు (శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ 100 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు) మంగళవారం నాటి తొలి టెస్టులో 17 ఓవర్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ వికెట్‌ను పడగొట్టడం ద్వారా హెరాత్ 100 వికెట్లు సాధించిన రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో స్వదేశంలో ఈ ఏడాది నవంబర్‌లో జరిగే టెస్టు మ్యాచ్ తన క్రీడాజీవితంలో ఆఖరి ఘట్టమని ఇటీవల హెరాత్ ప్రకటించాడు. ఈ సందర్భంగా తమ జట్టులోని సీనియర్ ఆటగాడు హెరాత్‌కు జట్టు సభ్యులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఒకే క్రీడా వేదికలో 100 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన వారిలో ఇంతవరకు శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ (సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్-కొలంబో, ఆస్గిరియా స్టేడియం-కాండీ, గాలే ఇంటర్నేషనల్ స్టేడియం), ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ (లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్-లండన్) మాత్రమే ఖ్యాతి గడించారు. ఇపుడు ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా రంగనా హెరాత్ చరిత్రలో నిలిచాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ వికెట్‌ను పడగొట్టడం ద్వారా హెరాత్ లాంగెస్ట్ ఫార్మాట్‌లో 431 వికెట్లు తీసుకున్నాడు.

చిత్రం..గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో 100 వికెట్లు పడగొట్టిన శ్రీలంక స్పిన్నర్,
సీనియర్ ఆటగాడు రంగనా హెరాత్‌కు ఘనంగా వీడ్కోలు చెబుతున్న సహచరులు