క్రీడాభూమి

జడేజాకు మందలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, మే 2: అంపైర్ నిర్ణయంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన గుజరాత్ లయన్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను మ్యాచ్ రిఫరీ ఎం. నయ్యర్ మందలించాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 23 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. మ్యాచ్ జరుగుతున్నప్పుడు అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జడేజా నిరసన ధోరణిని ప్రదర్శించాడు. ఫీల్డ్ అంపైర్లు ఆక్సెన్‌ఫోర్డ్, వికె శర్మ నుంచి ఫిర్యాదు అందడంతో నయ్యర్ విచారణ జరిపాడు. తాను పొరపాటు చేసినట్టు జడేజా అంగీకరించడంతో, మొదటి తప్పిదం కింద అతనిని మందలించి విడిచిపెట్టాడు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని సూచించాడు.