క్రీడాభూమి

చైనా ఓపెన్ బాడ్మింటన్ క్వార్టర్స్‌కు సింధు, శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫుజో, నవంబర్ 8: ఇక్కడ జరుగుతున్న చైనా ఓపెన్ వరల్డ్ టూర్ 750 బాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలుగు తేజాలు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ తమతమ విభాగాల్లో క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఒలింపిక్స్‌లో ఒకసారి, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రెండు పర్యాయాలు రజత పతకం సాధించిన సింధు మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో థాయిలాండ్‌కు చెందిన బుసనాన్ ఒగాంరుగపన్‌పై 21-12, 21-15 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకూ సింధు దూకుడుగా ఆడగా, ప్రత్యర్థి ఆత్మ రక్షణలో పడింది. రెండో సెట్‌లో బుసనాన్ కొంత సేపు సింధును ప్రతిఘటించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించిన సింధు రెండో సెట్‌ను కూడా సులభంగానే తన ఖాతాలో వేసుకొని, క్వార్టర్ ఫైనల్స్‌లో చోటు దక్కించుకుంది. కాగా, పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ 10-21, 21-9, 21-9 తేడాతో ఇండోనేషియా ఆటగాడు టామీ సుగియార్తోపై గెలుపొందాడు. తొలి సెట్‌ను చేజార్చుకున్నప్పటికీ, ఆ తర్వాత చెలరేగిపోయిన శ్రీకాంత్ వరుసగా రెండు సెట్లను కైవసుం చేసుకొని, క్వార్టర్స్ చేరాడు.