క్రీడాభూమి

రొనాల్డో శ్రమ వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్యూరిన్ (ఇటలీ), నవంబర్ 8: చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా తన జట్టు జువెంటాస్‌ను నాకౌట్ దశకు చేర్చడానికి క్రిస్టియానో రొనాల్డో పడిన శ్రమ వృథా అయింది. మాంచెస్టర్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో జువెంటాస్ గెలిచివుంటే, నేరుగా నాకౌట్‌కు చేరేది. అయితే, ఆ జట్టు అనూహ్యంగా 1-2 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొని, నాకౌట్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచి మాంచెస్టర్ యునైటెడ్ నుంచి ఎదురైన గట్టిపోటీని తట్టుకొని, గోల్స్ నమోదుకాకుండా చూసేందుకే జువెంటాస్ ప్రాధాన్యం ఇచ్చింది. దీనితో ప్రథమార్ధంలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ద్వితీయార్ధంలో వ్యూహాన్ని మార్చిన జువెంటాస్ దాడులకు ఉపక్రమించింది. 65వ నిమిషయంలో రొనాల్డో చక్కటి గోల్ చేయడంతో, జువెంటాస్‌కు 1-0 ఆధిక్యం లభించింది. ఆతర్వాత పూర్తిగా రక్షణాత్మకంగా ఆడిన జువెంటాస్ అదే తేడాతో విజయం సాధించాలనే వ్యూహాన్ని అనుసరించింది. అయితే, చివరి క్షణాల్లో మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాళ్లు రెచ్చిపోయారు. 86వ నిమిషంలో జువాన్ మతా గోల్ సాధించి, స్కోరును సమం చేయగా, మరో మూడు నిమిషాల్లోనే అలెక్స్ సాంచెజ్ ద్వారా మాంచెస్టర్ యునైటెడ్‌కు రెండో గోల్ లభించింది. జువెంటాస్ తీవ్ర దిగ్భ్రాంతి నుంచి తేరుకోక ముందే మ్యాచ్ ముగిసింది. ఇలావుంటే, షక్తర్ డొనెక్స్‌తో జరిగిన మ్యాచ్‌ని మాంచెస్టర్ సిటీ 6-0 తేడాతో సొంతం చేసుకుంది. గాబ్రియల్ జీసస్ మూడు గోల్స్ చేయగా, డేవిడ్ సిల్వ, రహీం స్టెర్లింగ్, రియాద్ మహరెజ్ తలా ఒక్కో గోల్ చేశారు. కాగా, పిజెన్‌పై రియల్ మాడ్రిడ్ 5-0 తేడాతో విజయభేని మోగించింది. మరో మ్యాచ్‌లో ఏఈకేను బయెర్న్ మ్యూనిచ్ 2-0 తేడాతో ఓడించింది.

చిత్రం..గోల్ చేసిన అనంతరం సహచరుడితో ఆనందాన్ని పంచుకుంటున్న క్రిస్టియానో రొనాల్డో (ఎడమ)