క్రీడాభూమి

ఫాస్ట్ బౌలర్లకు ఐపీఎల్ నుంచి మినహాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 8: ఫాస్ట్ బౌలర్లు గాయపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నందువల్ల, వారిని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి మినహాయించాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచించాడు. వారి అంతర్జాతీయ కెరీర్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడాలంటే, ఇలాంటి నిర్ణయం అత్యవసరమని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ)కి సుప్రీం కోర్టు నియమించిన పాలనాధికారుల బృందం (సీఓఏ) దృష్టికి అతను ఇదివరకే తీసుకెళ్లాడు. అయితే, ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఈ ప్రతిపాదనకు ససేమిరా అంటాయన్నది వాస్తవం. అంతేగాక, కోహ్లీ సూచనకు సీఓఏ నుంచి మద్దతు లభిస్తుందా అనేది అనుమానమే. ఇటీవల హైదరాబాద్‌లో సీఓఏ సభ్యులను కలిసిన కోహ్లీ వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ నుంచి పేసర్లను, ప్రత్యేకించి భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రాను మినాహాయించాల్సిందిగా కోరాడు. వచ్చే ఏడాది జరిగే ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. గురువారం పీటీఐతో మాట్లాడుతూ పేసర్లకు ఐపీఎల్ నుంచి మినహాయింపు అంశాన్ని మరోసారి ప్రస్తావించాడు. ప్రపంచ కప్‌లో భారత్ అనుకున్న స్థాయిలో రాణించాలంటే ఈ ప్రతిపాదన అమల్లోకి రావాలని అన్నాడు. ఇలావుంటే, ఫ్రాంచైజీలు ఇందుకు సమ్మతించే అవకాశాలు ఏమాత్రం లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.