క్రీడాభూమి

స్టార్క్, లియాన్‌కు విశ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ: దక్షిణాఫ్రికా, భారత్‌తో జరగబోయే టీ-20 సిరీస్‌ల నుంచి సూపర్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్, స్పిన్నర్ నాథన్ లియాన్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) విశ్రాంతినిచ్చింది.
జాతీయ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన జట్టు నుంచి వీరిని మినహాయించింది. ఆస్ట్రేలియా ఈనెల 17న దక్షిణాఫ్రికాతో ఏకైక టీ-20 మ్యాచ్‌ని ఆడనుంది. ఆతర్వాత, 21న బ్రిస్బేన్‌లో జరిగే మొదటి మ్యాచ్‌తో మొదలయ్యే మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో పాల్గొంటుంది. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియాతో టెస్టు సిరీస్‌తోపాటు తీరికలేని అంతర్జాతీయ షెడ్యూల్ ఉన్న కారణంగా కొంత మంది కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. ఈ జాబితాలో స్టార్క్, లియాన్‌తోపాటు పేసర్ పీటర్ సిడిల్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్క్ కూడా ఉన్నారు. కాగా, మార్కస్ స్టొయినిస్, జాసన్ బెహ్రెన్‌డర్ఫ్ మళ్లీ జట్టులో చోటు సంపాదించారు. ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన చీఫ్ కోచ్ జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్ జరగనున్న అంశాన్ని దృష్టిలో ఉంచుకొని, కీలక ఆటగాళ్లను టీ-20 జట్టు నుంచి తప్పించామని అన్నాడు. భారత్ వంటి బలమైన జట్టుతో జరిగే టెస్టు సిరీస్‌కు ముందు వారికి సరైన విశ్రాంతి అవసరమని వ్యాఖ్యానించాడు. భారత్‌తో టీ-20తోపాటు టెస్టు, వనే్డ సిరీస్‌లు ముగిసిన తర్వాత, వరల్డ్ కప్, ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ఉన్నాయని గుర్తుచేశాడు. ఇవన్నీ అత్యంత కీలకం కాబట్టే, కొంత మంది ఆటగాళ్లకు విశ్రాంతి అవసరమైందని వివరించాడు.
ఆస్ట్రేలియా టీ-20 జట్టు ఇదే..
ఆరోన్ ఫించ్ (కెప్టెన్), అలెక్స్ కారే, ఆష్టన్ అగర్, జాసన్ బెహన్‌డర్ఫ్, నాథన్ కౌల్టర్ నైల్, క్రిస్ లిన్, గ్లేన్ మాక్స్‌వెల్, బెన్ మెక్‌డార్మట్, డీఆర్సీ షార్ట్, బిల్లీ స్టాన్‌లేక్, మార్కస్ స్టొయినిస్, ఆండ్రూ టై, ఆడం జంపా.
భారత్ టీ-20 జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, దినేష్ కార్తీక్, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, కృణాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్, ఖలీల్ అహ్మద్.