క్రీడాభూమి

బాల్ ట్యాంపరింగ్ నిరోధానికి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, నవంబర్ 9: ప్రపంచాన్ని కుదిపేస్తున్న బాల్‌ట్యాంపరింగ్‌ను అరికట్టేందుకు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ బాగా ఉపకరిస్తుందని ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషన్ క్రికెటర్స్ అసోసియేషన్ (ఎఫ్‌ఐసీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ టోనీ ఐరిష్ అభిప్రాయపడ్డాడు. ఇక్కడ ఫెయిర్‌ఫాక్స్ మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఒక టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ సహా ముగ్గురు ఆటగాళ్లు బాల్‌ట్యాంపరింగ్‌కు పాల్పడడం, వారిపై ఏడాదిపాటు నిషే ధం విధించిన నేపథ్యంలో ఎఫ్‌ఐసీఏ సీఈఓ టోనీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బాల్‌ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఆటగాళ్లకు పెనాల్టీలు విధించడం కొంతవరకు సబబే అయినా, ఐసీసీ నియమనిబంధనల గురించి క్రికెటర్లకు సమగ్రంగా తెలియజెప్పడం ద్వా రా సమస్యకు పరిష్కారాన్ని కనుగొనేందుకు, తద్వారా వారిలో మార్పు తెచ్చేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డాడు. నిబంధనలను ఉల్లంఘించిన ఆటగాళ్లకు పెనాల్టీలను రెట్టింపు చేయడం ఒకరకంగా వారికి సందేశం వంటిది అవుతుందన్నాడు. క్రికెట్‌లో విశ్వవ్యాప్తంగా అమలులో ఉన్న కోడ్, నియమనిబంధనలు వంటి అంశాలపై క్రికెటర్లకు సమగ్రంగా తెలియజేయడం ద్వారా ఎంతో మే లు జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. ఈ దిశగా అంతర్జాతీయ సంస్థలు, ఐసీసీ వంటివాటితో కలసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశాడు.