క్రీడాభూమి

తొలి టెస్టులో ఇంగ్లాండ్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలే (శ్రీలంక), నవంబర్ 9: శ్రీలంక-ఇంగ్లాండ్ మధ్య ఇక్కడి గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో పర్యాటక జట్టు ఇంగ్లాండ్ 211 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక తొలి ఇన్సింగ్స్‌లో 203, రెండో ఇన్నింగ్స్‌లో 250 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 322 పరుగులు చేసింది. ఇదిలావుండగా, ఆతిధ్య శ్రీలంక జట్టులో సీనియర్ ఆటగాడు, ఎడమచేతివాటం స్పిన్నర్ రంగనా హెరాత్‌కు ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టు ఆఖరిది కావడం విశేషం. ఈ టెస్టు తర్వాత తాను క్రికెట్ నుంచి తప్పుకోనున్నట్టు హెరాత్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.