క్రీడాభూమి

ఉమేష్, బుబ్రా, కుల్దీప్‌లకు విశ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, నవంబర్ 9: వెస్టిండీస్‌తో ఆదివారం ఇక్కడి ఎం.ఏ చిదంబరం స్టేడియంలో జరిగే టీ-20 ఇంటర్నేషనల్ మూడోది, ఆఖరిది అయిన మ్యాచ్‌లో టీమిండియాలో ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్‌లకు విశ్రాంతి ఇచ్చారు. ఈ ముగ్గురు బౌలర్లు ఈనెల 21 నుంచి ఆస్ట్రేలియా టూర్‌లో ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో శారీరకంగా మరింత దృఢంగా ఉండేందుకు వీలుగా వెస్టిండీస్‌తో జరిగే మూడో టీ-20 నుంచి విశ్రాంతి కల్పించినట్టు బీసీసీఐ పేర్కొంది. పంజాబ్ ఆటగాడు సిద్దార్ధ కౌల్‌కు చివరి టీ-20లో అవకాశం కల్పించారు. ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్‌లకు చెన్నైలో జరిగే మూడో పేటీఎం మూడో టీ-20 నుంచి విశ్రాంతి కల్పించాలని టీమ్ మేనేజిమెంట్ నిర్ణయం తీసుకుందని బీసీసీఐ యాక్టింగ్ సెక్రెటరీ అమితాబ్ చౌదరి ఒక ప్రకటనలో తెలిపాడు. రానున్న ఆస్ట్రేలియా టూర్ నేపథ్యంలో పై ముగ్గురు ఆటగాళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నాడు.