క్రీడాభూమి

ఢిల్లీ డేర్‌డెవిల్స్ అసిస్టెంట్ కోచ్‌గా కైఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 9: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్‌కుగాను టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ మహమ్మద్ కైఫ్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికయ్యాడు. తమ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా కైఫ్ నియామకాన్ని ఢిల్లీ యాజమాన్యం ధృవీకరించింది. 2017 సీజన్‌లో గుజరాత్ లయన్స్ ఫ్రాంచైజీకి బ్రాడ్ హడ్జ్ కోచ్‌గా ఉన్న సమయంలో కైఫ్ అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించాడు. ఇపుడు వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ సీజన్‌కు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు కైఫ్‌ను అసిస్టెంట్ కోచ్‌గా ఎంపిక చేయడంతో రికీ పాంటింగ్, జేమ్స్ హోప్స్‌తో అతను కలసి పనిచేస్తాడు. చత్తీస్‌గఢ్ రంజీ ట్రోఫీలో చోటుదక్కించుకున్న తొలినాళ్లలో మహమ్మద్ కైఫ్ మెంటర్‌గా వ్యవహరిస్తూ జట్టును నడిపించాడు. కాగా, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌లో భాగస్వామి అయినందుకు ఎంతో సంతోషంగా ఉందని, జట్టు అసిస్టెంట్ కోచ్‌గా యువ ఆటగాళ్లను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తద్వారా దేశం గర్వించదగ్గ ఫ్రాంచైజీగా నిలబెట్టేందుకు తన వంతు కృషి చేస్తానని కైఫ్ గట్టి నమ్మకంతో చెప్పాడు. ఇదిలావుండగా సీనియర్ ఆటగాడు మహమ్మద్ కైఫ్ తమ ఫ్రాంచైజీలో భాగస్వామి అయినందుకు సాదరంగా స్వాగతిస్తున్నామని, తన సుదీర్ఘ అనుభవంతో వచ్చే ఐపీఎల్ సీజన్‌లో జట్టును ముందుండి నడిపించగలడన్న విశ్వాసం, నమ్మకం ఉన్నాయని ఢిల్లీ డేర్‌డెవిల్స్ డైరెక్టర్ ముస్త్ఫా గౌస్ అన్నాడు. ఇదిలావుండగా, 37 ఏళ్ల మహమ్మద్ కైప్ ఈ ఏడాది ప్రథమార్థంలో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. టీమిండియా తరఫున 125 వనే్డలు, 13 టెస్టుల్లో ఆడాడు. దేశవాళీ క్రికెట్‌లో ఆడిన 186 మ్యాచ్‌లలో 10,229 పరుగులు చేశాడు.