క్రీడాభూమి

రాయుడుపై భజ్జీ గుస్సా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, మే 2: ముంబయి ఇండియన్స్ తరఫున ఐపిఎల్‌లో ఆడుతున్న తెలుగు వీరుడు అంబటి రాయుడుపై అదే జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోపంతో అతనిని దూషించాడు. అయితే, రాయుడు కూడా వెనక్కు తగ్గకుండా మాటకు మాట సమాధానం చెప్పాడు. దీనితో కంగుతిన్న భజ్జీకి శాంతించక తప్పలేదు. ఈ సంఘటన రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌తో ఆదివారం నాటి ఐపిఎల్ మ్యాచ్‌లో చోటు చేసుకుంది. భజ్జీ తన రెండో ఓవర్ బౌల్ చేస్తున్నప్పుడు చోటు చేసుకుంది. ఇన్నింగ్స్‌లో అది పదో ఓవర్. భజ్జీ వేసిన నాలుగో బంతిని సౌరభ్ తివారీ డీప్ మిడ్‌వికెట్, లాంగ్ ఆన్ మధ్య ఉన్న గ్యాప్‌లో షాట్ కొట్టాడు. బంతి కోసం టిమ్ సౌథీతోపాటు రాయుడు కూడా ప్రయత్నించాడు. అతను డైవ్ చేసి బంతిని ఆపేందుకు చేసిన కృషి ఫలించలేదు. రాయుడు డైవ్ చేయడం వల్లే బంతి అతనికి తగిలి బౌండరీ లైన్ దాటిందని అనుమానించిన భజ్జీ అతనిని తీవ్రంగా మందలించాడు. ఆగ్రహంతో తిట్టాడు. రాయుడు క్షణం కూడా ఆలోచించకుండా ఎదురు సమాధానమిచ్చాడు. ఈదశలో ఇద్దరి మధ్య బాహాబాహీ తప్పదేమో అన్న అనుమానం తలెత్తింది. అయితే, భజ్జీ శాంతించి, తన బౌలింగ్‌ను కొనసాగించడానికి ఉపక్రమించడంతో ఘర్షణ చోటు చేసుకోలేదు. 12వ ఓవర్‌లో పీటర్ హాండ్స్‌కోమ్‌ను అవుట్ చేసిన భజ్జీ తన ఆనందాన్ని రాయుడుతో పంచుకోవడంతో వివాదానికి తెరపడిందని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 2008 ఏప్రిల్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించిన ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌ను అప్పట్లో ముంబయి ఇండియన్స్‌కు నాయకత్వం వహించిన భజ్జీ చెంపదెబ్బ కొట్టడం సంచలనం సృష్టించింది. బహుమతి ప్రదానం సమయంలో శ్రీశాంత్ ఏడుస్తూ కనిపించడంతో ఏం జరిగిందోనన్న అనుమానం వ్యక్తమై, చివరికి భజ్జీ నిర్వాకం అందరికీ తెలిసింది. ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లినప్పుడు ఆండ్రూ సైమండ్స్‌ను జాతి వివక్షతో దూషించాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పట్లో అజాత శత్రువు సచిన్ తెండూల్కర్ జోక్యం చేసుకొని, భజ్జీకి అనుకూలంగా సాక్ష్యం చెప్పాడు. సచిన్ కారణంగానే సస్పెన్షన్ వేటు నుంచి భజ్జీ బయటపడ్డాడు.

చిత్రం అంబటి రాయుడు (ఎడమ)పై
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హర్భజన్ సింగ్