క్రీడాభూమి

‘డెవిల్స్’ వేటకు ‘లయన్స్’ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, మే 2: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన గుజరాత్ లయన్స్ మంగళవారం హోం గ్రౌండ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను ఎదుర్కోవడానికి సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్న గుజరాత్ లయన్స్ జట్టుకు డేర్‌డెవిల్స్ నుంచి గట్టిపోటీ తప్పక పోవచ్చని విశే్లషకుల అభిప్రాయం. సురేష్ రైనా నాయకత్వంలోని గుజరాత్ లయన్స్ జట్టులో డ్వెయిన్ బ్రేవో, జేమ్స్ ఫాల్క్‌నెర్, రవీంద్ర జడేజా, దినేష్ కార్తీక్, బ్రెండన్ మక్‌కలమ్, ప్రవీణ్ కుమార్, డ్వెయిన్ స్మిత్ వంటి హేమాహేమీలు ఉన్నారు. అదే విధంగా జహీర్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న డేర్‌డెవిల్స్ జట్టుకు కార్లొస్ బ్రాత్‌వెయిట్, నాథన్ కౌల్టర్ నైల్, క్వింటన్ డికాక్, జెపి డుమినీ, ఇమ్రాన్ తాహిర్, పవన్ నేగీ, సంజూ శాంసన్ వంటి సమర్థుల అండ ఉంది. కాగితంపై చూస్తే ఇరు జట్లు సమవుజ్జీలుగానే కనిపిస్తున్నాయి. అయితే, హోం గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడుతున్న కారణంగా ప్రేక్షకుల మద్దతు గుజరాత్ లయన్స్‌కు దక్కడం ఖాయం. ఈ అవకాశాన్ని రైనా బృందం ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి.