క్రీడాభూమి

మేరీ కోమ్‌కు అంత ఈజీ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఈనెల 15 నుంచి న్యూఢిల్లీలో ప్రారంభం కానున్న మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత దిగ్గజ మహిళా బాక్సర్ మేరీ కోమ్ గెలుపు అంత సులువు కాదని ఇండియన్ బాక్సింగ్ హైపెర్ఫార్మెన్స్ డైరెక్టర్ శాంటియాగో నీవా అన్నాడు. ఇప్పటికే ఐదుసార్లు వరల్డ్ చాంపియన్‌గా అవతరించి గోల్డ్‌మెడల్స్ అందుకున్న మేరీకోమ్ ఇపుడు తాజాగా జరుగుతున్న వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మరోసారి గోల్డ్‌మెడల్‌పై కనే్నసినా కష్టసాధ్యమేనని వ్యాఖ్యానించాడు. ఈ చాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున పోటీపడే 10 మంది సభ్యుల జట్టుకు మేరీ కోమ్ నాయకత్వం వహిస్తుంది. ‘ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన మేరీ కోమ్ ఈసారి కూడా చాంపియన్‌గా నిలుస్తుందని ఎంతోమంది అంచనా వేస్తుండవచ్చు. కానీ అది అనుకున్నంత, ఆశించినంత సులువు కాదు.
ఈసారి పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. అద్భుత ప్రదర్శన చూపితేనే మరో గోల్డ్‌మెడల్ సాధ్యమవుతుంది’ అని పేర్కొన్నాడు. ఎలైట్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేన్‌కు (ఏఐబీఏ) అధిపతిగా వ్యవహరిస్తున్న శాంటియాగో నీవా మీడియాతో మాట్లాడుతూ తొలిసారిగా భారత్‌తో ఈ ఈవెంట్ జరుగుతోందని అన్నాడు.
భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ సత్తా ఏమిటో అందరికీ తెలిసిందేనని, కానీ ఆమెపై ఒత్తిడి ఉంటుందని, కానీ తనకున్న నమ్మకంతో వాటిని తట్టుకుని మళ్లీ మరోసారి భారత్‌కు గోల్డ్‌మెడల్ అందించగలదని తాను విశ్వసిస్తున్నానని అన్నాడు. ఈ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఒక గోల్డ్‌మెడల్‌తోపాటు కనీసం మూడు మెడల్స్ అందవచ్చుననే నమ్మకం తనకు ఉందని, అంతకంటే ఎక్కువ మెడల్స్ వస్తే మరింత సంతోషమేనని పేర్కొన్నాడు. మేరీ కోమ్‌తోపాటు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న లవ్‌లీనా (69 కేజీలు), మనీషా (54 కేజీలు) పతకాలు అందిస్తారనే గట్టి నమ్మకం ఉందని అన్నాడు.
వేధిస్తున్న కాలుష్యం : మాస్క్‌లు, స్కార్ప్‌లతో ప్రాక్టీసు
ఢిల్లీలో తొలిసారిగా జరుగుతున్న ఇంటర్నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి తరలివచ్చిన పలువురు బాక్సర్లను వాతావరణ కాలుష్యం తీవ్రంగా కలచివేస్తోంది. ఇక్కడకు వచ్చిన పలువురు మహిళా బాక్సర్లు ఇక్కడ దుమ్ము, ధూళితో కూడిన కలుషిత వాతావరణం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిన్‌లాండ్ దేశం మాదిరిగా ఢిల్లీని కాలుష్యం బారి నుంచి విముక్తి కలిగించాలని ఒలింపిక్ కాంస్య పతక విజేత మీరా పట్కోనెన్ అభిప్రాయపడింది. ‘చక్కనైన వాతావరణం కలిగిన దేశం నుంచి ఈ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చాను. ఇక్కడ వాతావరణ కాలుష్యం సమస్యగా మారింది. అయినా ఢిల్లీ వాతావరణం వేడిగా ఉంది’ అని మీరా పేర్కొంది. ఢిల్లీలో కలుషిత వాతావరణం వల్ల జాగింగ్‌కు వెళ్లలేకపోతున్నానని, కేవలం ఇండోర్‌లో శిక్షణ పైనే దృష్టిని కేంద్రీకరిస్తున్నానని తెలిపింది. వాతావరణ కాలుష్యం తీవ్రంగా మారిన నేపథ్యంలో వారంతా ముఖాలకు మాస్కులు, స్కార్ప్‌లు ధరించి ఇండోర్ గేమ్‌లలో సైతం ప్రాక్టీసు చేస్తున్నారు. కొలంబియా బాక్సర్ డయానా కొర్డెరో తన ముఖానికి ఒక వస్త్రాన్ని కప్పి ప్రాక్టీస్‌లో పాల్గొంటోంది. పోటీల్లో పాల్గొంటున్న మహిళా బాక్సర్లు గత వారం రోజులుగా ముఖాలకు సర్జికల్ మాస్కులు, స్కార్ప్‌లు ధరించి శిక్షణలో పాల్గొంటున్నారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు బల్గేరియా నుంచి వచ్చిన 27 ఏళ్ల బాక్సర్ స్టన్‌మిరా పెట్రోవా మాట్లాడుతూ ఇక్కడి కలుషిత వాతావరణం గురించి తన కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, ఇక్కడి వాతావరణం తనకేమాత్రం సరిపోదని పేర్కొంది. 2014లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో బాంటమ్‌వెయిట్ కేటగిరిలో ఆమె గోల్డ్‌మెడల్ సాధించింది. అదేవిధంగా పోటీల్లో పాల్గొంటున్న ఏడుగురు యూరోపియన్ బాక్సర్లు సైతం ఢిల్లీ వాతావరణంతో కళ్లు మండుతున్నాయని, ఇది ఆందోళన కలిగించే అంశమని వాపోతున్నారు. తమ బాక్సర్ల కోసం సురక్షిత వస్తువులను అందించాలని పోటీల నిర్వాహకులను కోరామని, కానీ వారు అందజేయలేదని కోచ్ పేర్కొన్నారు. ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న ఈ పోటీలో ఈనెల 24 వరకు జరుగనున్నాయి. ఢిల్లీ వాతావరణ కాలుష్యం గత కొంతకాలంగా తీవ్రంగా వేధిస్తున్న సంగతి తెలిసిందే. వాతావరణ కాలుష్యం అత్యధికంగా కలిగిన జాబితాలో ఢిల్లీ కూడా ఉండడం విశేషం. ఈ పోటీలను ఢిల్లీ బయట ప్రాంతంలో నిర్వహించాలని, తద్వారా బాక్సర్లకు ఎంతో మేలు చేకూర్చినవారు అవుతారని ఫ్రెంచ్ కోచ్ ఆంధోనీ వెనియంట్ పోటీల నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వాపోయాడు. తమలాగే పోటీలకు వచ్చిన ఎంతోమంది బాక్సర్ల తల్లిదండ్రులు సైతం వాతావరణ కాలుష్యం కారణంగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నాడు.