క్రీడాభూమి

ఆరో గోల్డ్‌మెడల్‌పై మేరీకోమ్ కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఇప్పటికే ఐదుసార్లు గోల్డ్‌మెడల్స్ కైవసం చేసుకున్న భారత స్టార్ మహిళా బాక్సర్ మేరీ కోమ్ గురువారం నుంచి ఇక్కడ ప్రారంభం కానున్న ప్రపంచ టోర్నమెంట్‌లో మరో గోల్డ్‌మెడల్ సాధించేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈనెల 15 నుంచి 24 వరకు ఏఐబీఏ మహిళల వరల్డ్ చాంపియన్‌షిప్ నిర్వహిస్తున్న 10వ ఈ టోర్నీకి దేశ రాజధాని న్యూఢిల్లీ రెండోసారిగా వేదిక కానుంది. 2006లో భారత్ తొలిసారిగా ఈ పోటీలను నిర్వహించింది. ఆ సీజన్‌లో భారత బాక్సర్లు 4 గోల్డ్, 1 కాంస్యం, 3 రజత పతకాలు సాధించారు. అయితే, ఇపుడు భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ ప్రపంచ ఈవెంట్‌లో 72 దేశాలకు చెందిన 300కి పైగా బాక్సర్లు పోటీపడనున్నారు. అయితే, ఈసారి పోటీ చాలా తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో 10 మంది భారత బాక్సర్లు పాల్గొంటున్న ఈ ఈవెంట్‌లో గోల్డ్‌మెడల్‌తో సహా కనీసం 4 పతకాలు దక్కే అవకాశాలు ఉన్నాయని పలువురు అంచనా వేస్తున్నారు.
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న దిగ్గజ బాక్సర్ 35 ఏళ్ల మేరీకోమ్‌పైనే ఎన్నో అంచనాలు ఉన్నాయి. వరల్డ్ ఈవెంట్స్‌లో ఇప్పటికే 5 గోల్డ్‌మెడల్స్‌ను తన ఖాతాలో జమ చేసుకున్న మేరీకోమ్ ఇపుడు మరో గోల్డ్‌మెడల్ సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. 48 కేజీల విభాగంలో పోటీపడుతున్న మేరీకోమ్ ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 2001 నుంచి ఈ విభాగంలో గోల్డ్‌మెడల్ కోసం పోటీ చాలా తీవ్రంగా ఉందని, ఇందుకోసం ఎంతోమంది అహరహం శ్రమిస్తున్నారని, వారి సత్తా కూడా తనకు బాగా తెలుసునని పేర్కొంది. కొత్తగా బాక్సింగ్ రింగ్‌లోకి వస్తున్న బాక్సర్లు సైతం చురుకుగా కదులుతూ గట్టి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని, అయినా ఈ రంగంలో తనకున్న అనుభవాన్నంతా రంగరించి గోల్డ్‌మెడల్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నానని స్పష్టం చేసింది. మేరీకోమ్‌తోపాటు మరో దిగ్గజ బాక్సర్, 60 కేజీల విభాగంలో పోటీపడుతున్న సరితాదేవి సైతం గోల్డ్‌మెడల్ సాధించే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సరితాదేవి ఖాతాలో ఇప్పటికే ఐదు ఆసియా టైటిళ్లతోపాటు 2006లో గోల్డ్‌మెడల్ సాధించిన రికార్డు కూడా ఉంది. ఇక మిగిలిన విభాగాల్లో పింకీ జంగ్రా (51 కేజీలు), మనీషా వౌన్ (54 కేజీలు), సోనియా (57 కేజీలు), సిమ్రాన్‌జిత్ కౌర్ (64 కేజీలు), లోలినా బొరొహైన్ (69 కేజీలు), సవీటీ బోరా (75 కేజీలు), భాగ్యబతి కచారి (81 కేజీలు), సీమా పూనియా (+81 కేజీలు) భారత్ తరఫున పోటీపడనున్నారు. వీరంతా రానున్న ఒలింపిక్, వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో మెడల్స్ సాధించే బాక్సర్లుగా మెరవనున్నారు.
ఇక ఫెదర్‌వెయిట్‌లో రెండేళ్ల క్రితం టైటిల్ సాధించిన ఇటలీ బాక్సర్ అలెస్సియా మెసియానో ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. అదేవిధంగా 2016 ఈవెంట్‌లో సిల్వర్ మెడల్ విజేత, ఆస్ట్రేలియాకు చెందిన కాయే స్కాట్, థాయ్‌కి చెందిన పీమ్‌లిలయ్ లవోపీమ్, రష్యాకు చెందిన అనస్థేయియా బెలియాకొవా సైతం గోల్డ్‌మెడల్ సాధించే దిశగా బరిలోకి దిగుతున్నారు.
గోల్డ్‌మెడల్ సాధించే అవకాశం ఉన్నవారిలో అమెరికాకు చెందిన విర్జీనియా ఫుచ్ (51 కేజీలు), చైనీస్ తైపీకి చెందిన లిన్ యు టింగ్ (54 కేజీలు), చైనాకు చెందిన యిన్ జున్‌హువా (57 కేజీలు), ఫిన్లాండ్‌కు చెందిన మీరా పొట్కెనెన్ (60 కేజీలు), చైనాకు చెందిన గు హాంగ్ (69 కేజీలు), నెదర్లాండ్‌కు చెందిన నౌచ్కా ఫాంటిజ్ని (75 కేజీలు), చైనాకు చెందిన వాంగ్ లినా (81 కేజీలు), డిఫెండింగ్ చాంపియన్ యాంగ్ జియావొలి (+81 కేజీలు) ఉన్నారు.
ఇదిలావుండగా, వార్తల్లో వివాదాస్పదంగా నిలిచిన కొసోవో బాక్సర్ డొంజెటా సడికు ఢిల్లీలో జరుగనున్న వరల్డ్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగుతుందా? లేదా? అన్న అంశం ఇంకా తేలలేదు. అయితే, దక్షిణ ఈశాన్య యూరోప్‌లోని వివాదాస్పద ప్రాంత బాక్సర్ డొంజెటా సడికుగానీ, ఆమెకు సంబంధించిన ఇద్దరు కోచ్‌లకు గానీ ఇంతవరకు భారత ప్రభుత్వం ఎలాంటి వీసా మంజూరు చేయలేదు. భారీ ఎత్తున నిర్వహించే ప్రధాన ఈవెంట్‌కు ఆతిధ్యం ఇస్తున్న తమకు అలాంటి వివాదాస్పద వ్యక్తులకు చోటు కల్పించడం వల్ల భవిష్యత్తులో జరిగే పలు అంతర్జాతీయ ఈవెంట్లకు అపకీర్తి కలుగుతుందని భారత ఒలింపిక్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆమె ఈ పోటీల్లో పాల్గొనేందుకు తాము అంగీకరించమని అసోసియేషన్ స్పష్టం చేసింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సైతం కొసోవో అథ్లెట్ వంటివారిని ప్రధాన ఈవెంట్లలో ప్రాతినిధ్యం వహించకుండా చూడాలని ఇంటర్నేషన్ ఫెడరేషన్లకు లేఖలు రాసింది.
ఇదిలావుండగా, వివాదాస్పద కొసోవో బాక్సర్ డొంజెటా సడికు వీసా అంశాన్ని తక్షణం పరిష్కరించాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) బుధవారం కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖను కోరింది. ఈ మేరకు ఐఓఏ ప్రెసిడెంట్ నరీంద్ర బాత్రా గురువారం నుంచి ప్రారంభం కానున్న మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో కొసోవో బాక్సర్, ఆమె కోచ్‌లు పాల్గొనేందుకు వీలుగా సంబంధిత అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలని రాసిన లేఖలో ఘాటుగా పేర్కొన్నాడు. రానున్న ఒలింపిక్స్‌తోపాటు వివిధ ప్రపంచ పోటీల్లో పాల్గొనేందుకు విలువలు, సిద్ధాంతాలను పరిరక్షించేందుకు వీలుగా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా చూడాలని సూచించాడు. ఒక దేశానికి చెందిన అథ్లెట్‌కు వీసా మంజూరు చేయకపోవడం వల్ల భవిష్యత్తులో భారత్‌లో నిర్వహించబోయే ప్రధాన ఈవెంట్లకు విఘాతం కలుగుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నాడు.