క్రీడాభూమి

శ్రీలంకకు స్వల్ప ఆధిక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లేకల్, నవంబర్ 15: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంకకు 46 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 75.4 ఓవర్లలో 290 పరుగులు సాధించి ఆలౌటైంది. రొరీ బర్న్స్ 43, జొస్ బట్లర్ 63, చివరిలో శామ్ కూరెన్ 64, అదిల్ రషీద్ 31 చొప్పున పరుగులు చేసి ఇంగ్లాండ్‌ను ఆదుకోవడానికి ప్రయత్నించారు. అయితే లంక బౌలర్లు దిల్‌రువాన్ పెరెరా (61 పరుగులకు 4 వికెట్లు), మలింద పుష్పకుమార (89 పరుగులకు 3 వికెట్లు), అకిల ధనంజయ (80 పరుగులకు 2 వికెట్లు) ముందు ఎక్కువ సేపు నిలవలేకపోయారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 103 ఓవర్లలో 336 పరుగులు సాధించింది. దిముత్ కరుణరత్నే 63 పరుగులు చేయగా, ధనంజయ డి సిల్వ 59, రోషన్ సిల్వ 85 పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జాక్ లీచ్ 70 పరుగులకు మూడు, అదిల్ రషీద్ 75 పరుగులకు మూడు, మోయిన్ అలీ 85 పరుగులకు రెండు చొప్పున వికెట్లు పడగొట్టారు. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత, రెండో రోజు ఆట ముగియడానికి కేవలం ఒక ఓవర్ మాత్రమే మిగిలింది. ఈ ఓవర్‌ను ఆడిన ఇంగ్లాండ్ ఒక్క పరుగు కూడా చేయలేదు. జాక్ లీచ్, రొరీ బర్న్స్ పరుగుల ఖాతా తెరవకుండా క్రీజ్‌లో ఉన్నారు.

సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 75.4 ఓవర్లలో 290 ఆలౌట్ (రొరీ బర్న్స్ 43, జొస్ బట్లర్ 63, శామ్ కూరెన్ 64, అదిల్ రషీద్ 31, దిల్‌రువాన్ పెరెరా 4/61, మలింద పుష్పకుమార 3/89, అకిల ధనంజయ 2/80).
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 103 ఓవర్లలో 336 ఆలౌట్ (కరుణరత్నే 63, ధనంజయ డి సిల్వ 59, రోషన్ సిల్వ 85, జాక్ లీచ్ 3/70, అదిల్ రషీద్ 3/75, మోయిన్ అలీ 2/85).
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: వికెట్ నష్టం లేకుండా 0 (జాక్ లీచ్ 0 నాటౌట్, రొరీ బర్న్స్ 0 నాటౌట్).