క్రీడాభూమి

యూసుఫ్ పఠాన్ విజృంభణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 2: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. యూసుఫ్ పఠాన్ విజృంభణకు, ఆండ్రె రసెల్ తోడు కావడంతో ఒకానొక దశలో ఓటమి అంచున నిలిచిన నైట్ రైడర్స్ బరో ఐదు బంతులు మిగిలి ఉండగా, ఐదు వికెట్ల తేడాతో విజయ భేరి మోగించింది. బెంగళూరు నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యాన్ని నైట్ రైడర్స్ ఐదు వికెట్లు కోల్పోయి చేదించింది. యూసుఫ్ పఠాన్ అజేయంగా 60 పరుగలు చేసి నైట్ రైడర్స్ విజయంలో కీలక భూమిక పోషించాడు. అంతకు ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ లోకేష్ రాహుల్ చెరి 52 పరుగులు చేయడంతో బెంగళూరు 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 185 పరుగులు సాధించగలిగింది.
నిరాశ పరచిన గేల్
భార్య ప్రసవం సమయంలో తాను ఆమెకు ధైర్యంగా అక్కడే ఉండాలని స్వదేశానికి వెళ్లిన వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ తిరిగి వచ్చి ఈ మ్యాచ్‌లో ఆడాడు. అయితే, అతను ఏడు బంతులు ఎదుర్కొని, ఏడు పరుగులు చేసి, మోర్న్ మోర్కెల్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ రాబిన్ ఉతప్ప క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు. జట్టు స్కోరు ఎనిమిది పరుగుల వద్ద గేల్ వికెట్ కూలడంతో అభిమానులు నిరాశ చెందారు. కానీ, ఓపెనర్ లోకేష్ రాహుల్, కెప్టెన్ విరాట్ కోహ్లీ వారికి ఊరటనిచ్చారు. వీరు రెండో వికెట్‌కు 84 పరుగులు జోడించారు. వేగంగా స్కోరు పెంచేందుకు ప్రయత్నించిన రాహుల్ 32 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 52 పరుగులు చేసి పీయూష్ చావ్లా బౌలింగ్‌లో యూసుఫ్ పఠాన్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. పించ్ హిట్టర్‌గా పేరుపొందిన ఎబి డివిలియర్స్ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. అతను ఆరు బంతుల్లో నాలుగు పరుగులు చేసి, పీయూష్ చావ్లా బౌలింగ్‌లో ఎల్‌బి అయ్యాడు. అప్పటికి బెంగళూరు స్కోరు 109 పరుగులు. మరో 20 పరుగుల అనంతరం కోహ్లీ వికెట్ కూలింది. అతను 44 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లతో 52 పరుగులు చేసి మోర్న్ మోర్కెల్ బౌలింగ్‌లో ఆండ్రె రసెల్‌కు దొరికాడు. సచిన్ బేమీ ఎనిమిది బంతుల్లో 16 పరుగులు చేసి రసెల్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. చివరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు దిగిన స్టువర్ట్ బిన్నీ నాలుగు బంతులు ఎదుర్కొని, ఒక ఫోర్, రెండు సిక్సర్ల సహాయంతో 16 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో మనీష్ పాండే క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. చివరి బంతిలో రనౌటైన వాట్సన్ 21 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 34 పరుగులు సాధించాడు. బెంగళూరు 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 185 పరుగులు చేసే సమయానికి ఒక్క బంతిని కూడా ఎదుర్కొనే అవకాశం రాని వరుణ్ ఆరోన్ నాటౌట్‌గా నిలిచాడు. నైట్ రైడర్స్ బౌలర్లలో మోర్న్ మోర్కెల్ 28 పరుగులకు రెండు, పీయూష్ చావ్లా 32 పరుగులకు రెండు చొప్పున వికెట్లు కూల్చారు.
బెంగళూరులో కోహ్లీ సేను ఓడించేందుకు 186 పరుగులు సాధించాల్సిన నైట్ రైడర్స్ ఆరు పరుగుల స్కోరు వద్ద ఓపెనర్ రాబిన్ ఉతప్ప (1) వికెట్‌ను కోల్పోయింది. రెండో వికెట్‌కు 28 పరుగులు జత కలిసిన తర్వాత యజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో క్రిస్ లిన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతను 12 బంతుల్లో 12 పరుగులు చేశాడు. ఈ స్కోరులో ఒక సిక్స్ ఉంది. రన్‌రేట్ ఆశించిన మేరకు లేకపోవడంతో దిగాలు పడుతున్న నైట్ రైడర్స్ అభిమానులకు తబ్రైజ్ షంసీ తన మొదటి ఓవర్‌లో 15 పరుగులు సమర్పించుకోవడంతో ఊరట లభించింది. కానీ, జట్టును గెలిపించే బాధ్యతను స్వీకరించే పట్టుదలతో కనిపించిన కెప్టెన్ గంభీర్ 29 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 37 పరుగులు చేసి, శ్రీనాథ్ అరవింద్ బౌలింగ్‌లో బౌల్డ్‌కావడంతో పరిస్థితి మళ్లీ సంక్లిష్టంగా మారింది. మొదటి ఓవర్‌లో భారీగా పరుగులిచ్చిన షంసీ రెండో ఓవర్‌లో కేవలం మూడు పరుగులే ఇవ్వడం నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ తడబాటుకు అద్దం పట్టింది. జట్టు స్కోరుకు మరో మూడు పరుగులు జత కలిసిన తర్వాత మనీష్ పాండే (8) వికెట్ కూలింది. అతను షేన్ వాట్సన్ బౌలింగ్‌లో సచిన్ బేబీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో ఆండ్రె రసెల్ రాకతో నైట్ రైడర్స్ ఆశలు చిగురించాయి. అతనితో జత కలిసిన యూసుఫ్ పఠాన్ కూడా చెలరేగిపోయాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 7.2 ఓవర్లలో 96 పరుగలు జోడించి, నైట్ రైడర్స్‌ను విజయం ముంగిట నిలిపారు. రసెల్ 24 బంతులు ఎదుర్కొని, ఒక ఫోర్, నాలుగు సిక్సర్లతో 39 పరుగులు చేసి యజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో స్టువర్ట్ బిన్నీ క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. 19.1 ఓవర్లలో నైట్ రైడర్స్ ఐదు వికెట్లకు 186 పరుగులు చేసి విజయభేరి మోగించగా, 29 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 60 పరుగులు చేసిన యూసుఫ్ పఠాన్, 5 బంతుల్లో, ఒక ఫోర్ సాయంతో 7 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ నాటౌట్‌గా నిలిచారు.
--
సంక్షిప్త స్కోర్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: 20 ఓవర్లలో 7 వికెట్లకు 185 (లోకేష్ రాహుల్ 52, విరాట్ కోహ్లీ 52, షేన్ వాట్సన్ 34, సచిన్ బేబీ 16, స్టువర్ట్ బిన్నీ 16, మోర్న్ మోర్కెల్ 2/28, పీయూష్ చావ్లా 2/32).
కోల్‌కతా నైట్ రైడర్స్: 19.1 ఓవర్లలోవ 5 వికెట్లకు 186 (గంభీర్ 37, యూసుఫ్ పఠాన్ 60 నాటౌట్, రసెల్ 39, యజువేంద్ర చాహల్ 2/27).
--

కోల్‌కతా నైట్ రైడర్స్ పేసర్ ఉమేష్ యాదవ్ నాలుగు ఓవర్లు బౌల్ చేసి 56 పరుగులు ఇచ్చాడు. ఈ ఐపిఎల్‌లో ఎక్కువ పరుగుల సమర్పించుకున్న బౌలర్ల జాబితాలో అతను రెండో స్థానంలో నిలిచాడు.
నైట్ రైడర్స్ టాప్ నాలుగురు బ్యాట్స్‌మెన్ ఈ మ్యాచ్‌లో 61 పరుగులు చేయగలిగారు. 19 ఇన్నింగ్స్‌లో ఇదే అత్యల్ప స్కోరు.
నైట్ రైడర్స్ బ్యాట్స్‌మన్ ఎబి డివిలియర్స్‌ను నైట్ రైడర్స్ బౌలర్ పీయూష్ చావ్లా అవుట్ చేయడం ఇది నాలుగోసారి. ఇప్పటి వరకూ మరే ఇతర బౌలర్ డివిలియర్స్‌ను ఐపిఎల్‌లో మూడు కంటే ఎక్కువ పర్యాయాలు అవుట్ చేయలేకపోయారు.

చిత్రం యూసుఫ్ పఠాన్
(60 నాటౌట్)