క్రీడాభూమి

సమష్టిగా పోరాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈనెల 21న బ్రిస్బేన్‌లో జరిగే టీ-20 మ్యాచ్‌తో భారత్ టూర్ మొదలవుతుంది. ఆసీస్‌తో టీమిండియా మూడు టీ-20 (నవంబర్ 21న బ్రిస్బేన్, 23న మెల్బోర్న్, 25న సిడ్నీ) మ్యాచ్‌లతోపాటు నాలుగు టెస్టులు, మూడు వనే్డ ఇంటర్నేషనల్స్ కూడా ఆడుతుంది. డిసెంబర్ 6 నుంచి 10 మధ్య తొలి టెస్టు అడిలైడ్‌లో, 14 నుంచి 18 వరకు రెండో టెస్టు పెర్త్‌లో, 26 నుంచి 30 వరకు మూడో టెస్టు మెల్బోర్న్‌లో జరుగుతాయి. చివరిదైన నాలుగో టెస్టు జనవరి 3-7 వరకు సిడ్నీలో ఉంటుంది. జనవరి 12న మొదటి వనే్డని సిడ్నీలోనే ఆడతారు. రెండో వనే్డ 15న అడెలైడ్‌లో, చివరిదైన మూడో వనే్డ 18న మెల్బోర్న్‌లో ఉంటాయి.
============================

ముంబయి, నవంబర్ 15: సమస్యలను అధిగమిస్తూ, సమష్టిగా పోరాడాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతామని సహచరులకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పిలుపునిచ్చాడు. గురువారం ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరే ముందు అతను విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు. ఇంగ్లాండ్ పర్యటనలో ఎదురైన చేదు అనుభవాలు, అక్కడ దొర్లిన పొరపాట్లను ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. ఇంగ్లాండ్ టూర్ తర్వాత టీమిండియా పలు టోర్నీలు, సిరీస్‌ల్లో గొప్పగా ఆడిందని అన్నాడు. అయితే, ఆస్ట్రేలియాలో పిచ్‌ల తీరు, ఆ జట్టులోని ఆటగాళ్ల సామర్థ్యం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుంటే, ఇంగ్లాండ్‌లో దొర్లిన పొరపాట్లు పునరావృతం కాకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశాడు. బ్యాట్స్‌మెన్ అంతా అవగాహనతో ఆడాలని, సాధ్యమైనంత ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడాలని కోరాడు. అదే విధంగా టెయిలెండర్లు భయపడకుండా ఆసీస్ పేస్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నాడు. భారత బ్యాటింగ్ లైనప్ బలంగా ఉందని అంటూనే, లోపాలు కూడా చాలా ఉన్నాయని కోహ్లీ వ్యాఖ్యానించాడు. వాటిని సరిదిద్దుకోవడం చాలా అవసరమని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును ఆస్ట్రేలియాలోనే ఎదుర్కోవడం సులభమైన విషయం కాదన్నాడు. ఏ మాత్రం పొరపాట్లు దొర్లినా చేదు ఫలితాలను చవిచూడక తప్పదని అన్నాడు. బౌలింగ్ విభాగంపై అతను సంతృప్తి వ్యక్తం చేశాడు. ఏ రకంగా చూసినా ఆస్ట్రేలియాకు గట్టిపోటీనిచ్చి, సిరీస్‌లను సాధించే సత్తా భారత్‌కు ఉందని చెప్పాడు. అయితే, గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను గుర్తుంచుకోవాలని, ప్రత్యర్థిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని చెప్పాడు. చీఫ్ కోచ్ రవి శాస్ర్తీ మాట్లాడుతూ ఆత్మవిశ్వాసంతో ఆడితేనే విజయాలు సాధ్యమవుతాయని చెప్పాడు. ఆస్ట్రేలియా నుంచి ఎదురయ్యే గట్టిపోటీని తట్టుకొని, ఎదురుదాడి చేయాలంటే, నైపుణ్యంతోపాటు ఆత్యస్థైర్యం కూడా అవసమని అన్నాడు. జట్టులో ఎవరికీ ఫిట్నెస్ సమస్యలు లేకపోవడాన్ని అతను సానుకూల పరిణామంగా అభివర్ణించాడు. ఆసీస్ టూర్ కష్టతరమైనదని, సిరీస్‌లను సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డాల్సి ఉంటుందని రవి శాస్ర్తీ స్పష్టం చేశాడు.