క్రీడాభూమి

రెండో టెస్టులో బంగ్లాదేశ్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా: జింబాబ్వేతో గురువారం ఇక్కడ ముగిసిన రెండో టెస్టును 218 పరుగుల భారీ తేడాతో గెల్చుకోవడం ద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను సమం చేసుకుంది. మెహదీ హసన్ మీర్జా 38 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టి, బంగ్లాదేశ్ విజయంలో కీలక భూమిక పోషించాడు.
ఈ సిరీస్ మొదటి టెస్టులో జింబాబ్వే 151 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీనితో రెండో టెస్టు బంగ్లాదేశ్‌కు అత్యంత కీలకంగా మారింది. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో చెలరేగిపోయిన బంగ్లాదేశ్ 7 వికెట్ల నష్టానికి 522 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ముష్ఫికర్ రహీం 219 పరుగులతో నాటౌట్‌ణగా నిలవగా, మోమినుల్ హక్ 161 పరుగులు సాధించాడు. కేల్ జార్విస్ 71 పరుగులిచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే తన తొలి ఇన్నింగ్స్‌లో 304 పరుగులకు ఆలౌటైంది. బ్రెండన్ టేలర్ 110, పీటర్ మూర్ 83 పరుగులతో రాణించారు. అయితే, మిగతా ఆటగాళ్లు విఫలం కావడంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులు వెనుకబడింది. బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ 107 పరుగులిచ్చి 5 వికెట్లు కూల్చాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌ను ఆరు వికెట్లకు 224 పరుగుల స్కోరువద్ద డిక్లేర్ చేసింది. మహమ్మదుల్లా అజేయంగా 101 పరుగులు సాధించాడు. కేల్ జార్విస్ 27 పరుగులిచ్చి రెండు వికెట్లు కూల్చాడు. 443 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన జింబా బ్వే రెండో ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన స్కోరుకు ఇది సమానం. దీనితో ఆ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 218 పరుగుల ఆధిక్యంతో విజయం సాధ్యమైంది. జింబాబ్వే తరఫున బ్రెండన్ టేలర్ 106 పరుగులతో నాటౌట్‌గా నిలవడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన అతను రెండో ఇన్నింగ్స్‌లోనూ ఒంటరి పోరాటాన్ని కొనసాగించినప్పటికీ ఫలితం లేకపోయింది. మెహదీ హసన్ ఐదు వికెట్లు కూల్చి జింబాబ్వే ఇన్నింగ్స్‌ను దారుణంగా దెబ్బతీశాడు. దీనితో బంగ్లా భారీ విజయంతో సిరీస్‌ను సమం చేసుకోగలిగింది.
సంక్షిప్త స్కోర్లు: బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 7 వికెట్లకు 522 డిక్లేర్డ్ (ముష్ఫికర్ రహీం 219 నాటౌట్, మోమినుల్ హక్ 161, కేల్ జార్విస్ 5/71).
జింబాబ్వే తొలి ఇన్నింగ్స్: 304 ఆలౌట్ (బ్రెండన్ టేలర్ 110, పీటర్ మూర్ 83, తైజుల్ ఇస్లామ్ 5/107).
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ (తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 218): ఆరు వికెట్లకు 224 డిక్లేర్డ్ (మహమ్మదుల్లా 101 నాటౌట్, కేల్ జార్విస్ 2/27).
జింబాబ్వే రెండో ఇన్నింగ్స్ (లక్ష్యం 443): 224 ఆలౌట్ (బ్రెండన్ టేలర్ 106 నాటౌట్, మెహదీ హసన్ మీర్జా 5/38).