రాష్ట్రీయం

హర్మన్‌ప్రీత్ సేనకు సిసలైన సవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొవిడెన్స్ (గుయానా), నవంబర్ 16: హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా మహిళల జట్టు ఇపుడు అతి పెద్ద చాలెంజ్‌ను ఎదుర్కోనుంది. ఐసీసీ మహిళల వరల్డ్ టీ-20 చాంపియన్‌షిప్ దిశగా దూసుకుపోయేందుకు శనివారం ఆస్ట్రేలియాతో ఇదే వేదికపై భారత్ బిగ్ ఫైట్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ రెండు జట్లు మూడు దశల్లో జరిగిన పోటీల్లో ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమిని ఎదుర్కోకుండా ప్రత్యర్థులను మట్టకరిపించి సెమీఫైనల్స్‌లో బెర్త్‌లను ఖాయం చేసుకున్నాయి. టీ-20లో చివరి లీగ్ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో పోటీ నువ్వానేనా అన్న రీతిలో సాగే అవకాశం ఉంది. ఇదే ఉత్సాహం, ఊపుతో ఉన్న భారత్, ఆసిస్ కదనోత్సాహంతో ముందుకు సాగుతున్నాయి.
భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తొలి టీ-20లో న్యూజిలాండ్‌పై సెంచరీ నమోదు చేయగా, సీనియర్ క్రీడాకారిణి మిథాలీ రాజ్ తన శక్తియుక్తులన్నింటినీ ప్రదర్శించి రెండు మ్యాచ్‌లలో జట్టు గెలుపునకు అవసరమైన అర్ధ సెంచరీలు నమోదు చేసి కీలకంగా మారింది. భారత్ తన మూడో మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను 52 పరుగులతో ఓడించి సెమీఫైనల్స్‌లో చోటు దక్కించుకుంది. న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లు టోర్నమెంట్‌లో నాకౌట్‌కు చేరుకోని నేపథ్యంలో ఇపుడు బలమైన జట్లుగా భారత్, ఆస్ట్రేలియా బరిలో పోరాడనున్నాయి. ఆసిస్ తన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 52 పరుగులతో విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను 9 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఆ తర్వాత జరిగిన మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 33 పరుగుల తేడాతో ఓడించింది. కెప్టెన్ మెగ్ లాన్నింగ్, వికెట్ కీపర్ అలైసా హీలే వంటివారు అద్భుత ఆటతీరుతో జట్టును విజయపథంలోకి తీసుకెళ్లే సత్తా ఉన్నవారు కావడంతో వారికి మిగిలినవారు చేయూత అందిస్తుండడంతో గెలుపుపై గట్టి నమ్మకంతో ఉంది.

కోహ్లీ, రోహిత్‌ను అధిగమించిన మిథాలీ
భారత మహిళా క్రికెట్ సభ్యురాలు, సీనియర్ క్రీడాకారిణి మిథాలీరాజ్ టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేయడంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మను అధిగమించింది. భారత్‌లో మహిళలు, పురుషుల జట్లలో ఏ క్రికెటర్ సాధించని ఘనతను మిథాలీ సొంతం చేసుకుంది. ప్రొవిడెన్స్ (గుయానా)లో జరుగుతున్న ఐసీసీ మహిళల వరల్డ్ టీ-20లో భాగంగా శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మిథాలీ 52 పరుగులు చేసింది. టీ-20ల్లో రోహిత్ శర్మ (2207), విరాట్ కోహ్లీ (2102) పరుగులు సాధించగా, మిథాలీరాజ్ 2283 పరుగులు చేసింది. పురుషుల్లో అత్యధిక పరుగులు చేసిన న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గుప్తిల్ (2271)ను సైతం మిథాలీ అధిగమించింది. అంతేకాకుండా ప్రపంచ మహిళా క్రికెట్‌లో టీ-20లో అత్యధిక పరుగులు సాధించిన నాలుగో క్రికెటర్‌గా మిథాలీ రికార్డు పుటల్లో చోటుదక్కించుకుంది. టీ-20లో అత్యధిక పరుగులు చేసినవారిలో న్యూజిలాండ్ బ్యాట్స్‌ఉమన్ సుజీ బేట్స్ (2996) టాప్‌లో కొనసాగుతోంది. ఇదిలావుండగా, శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగిన మూడో టీ-20లో 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన తర్వాత మీడియాతో మాట్లాడిన మిథాలీరాజ్ శనివారం ఆస్ట్రేలియాతో జరిగే పోరులో తమదే పైచేయి అవుతుందనే గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేసింది. తమ జట్టులో ఎక్కువ శాతం యువ ఆటగాళ్లు ఉన్న నేపథ్యంలో గెలుపే ధ్యేయంగా సమష్టి కృషితో పోరాడుతామని, ఐసీసీ వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంటామనే ధీమాను వ్యక్తపరిచింది. కాగా, తాము బ్యాటింగ్, బౌలింగ్‌లో మరింత పరిణితి సాధించాల్సిన అవసరం ఎంతో ఉందని మిథాలీరాజ్ అభిప్రాయపడింది. బరిలోకి దిగకముందు జరిగే ప్రణాళికలో అనుకున్న రీతిలో బౌలింగ్ చేయలేకపోతున్నామని పేర్కొంది. శనివారం ఆస్ట్రేలియాతో జరిగే పోరు తమకు అత్యంత కీలకం కావడంతో అన్నివిభాగాల్లో రాణించేందుకు, తద్వారా విజయం సాధించేందుకు దూకుడును ప్రదర్శించాల్సిన అవసరం ఎంతో ఉందని అంది.