క్రీడాభూమి

ఆసియా అండర్-15 బాలికల చాంపియన్‌షిప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 17: జపాన్‌లోని ఫుజిమిలో జరుగుతున్న ఆసియా అండర్-15 బాలికల చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు 7 పతకాలు కైవసం చేసుకుని పతకాల పట్టికలో 181 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచారు. మొత్తం పతకాల్లో 3 గోల్డ్‌మెడల్స్ కూడా ఉన్నాయి. 43 కేజీల విభాగంలో పోటీపడిన వరల్డ్ కేడెట్ కాంస్య పతక విజేత స్వీటీ గోల్డ్‌మెడల్ అందుకున్నవారిలో ఉంది. భారత్ ఖాతాలో మూడు రజత పతకాలు, ఒక కాంస్య పతకాలు ఉన్నాయి. జపాన్ 6 గోల్డ్‌మెడల్స్‌తో 202 పాయింట్లతో పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
150 వికెట్లు తీసిన న్యూజిలాండ్ బౌలర్
అబూదాబి, నవంబర్ 17: న్యూజిలాండ్ ఎడమచేతి పేసర్ నీల్ వాగ్నెర్ 150 వికెట్లు తీసిన ఆ దేశ టీమ్ 8వ బౌలర్‌గా నిలిచాడు. అబూదాబిలో శనివారం జరిగిన తొలిటెస్టు రెండో రోజున ఈ ఘనత సాధించాడు. 86 టెస్టుల్లో 431 వికెట్లు తీసి న్యూజిలాండ్ జట్టులో రిచర్డ్ హార్డ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.