క్రీడాభూమి

వరల్డ్ కప్‌లో ఆడేందుకు ఓకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, నవంబర్ 17: ఈనెల 28నుంచి భారత్‌లో జరిగే హాకీ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు పాకిస్తాన్‌కు ఇప్పటివరకు ఉన్న అడ్డంకులు దాదాపు తొలగిపోయినట్టే. వీసా నిబంధనలు, స్పాన్సర్‌షిప్‌లపై ప్రతిబంధకాలకు క్లియరెన్స్ రావడంతో భారత్‌లో పాక్ టూర్ దాదాపు ఖాయమైనట్టేనని తెలుస్తోంది. ఈనెల 28 నుంచి డిసెంబర్ 16 వరకు ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో హాకీ వరల్డ్ కప్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో పాక్ ఆటగాళ్లకు భారత హైకమిషన్ వీసాలు జారీ చేయడంతోపాటు పాక్ జట్టు ఖర్చుల కోసం దాదాపు 9 మిలియన్ల పాకిస్తానీ సొమ్మును చెల్లించేందుకు ఆ దేశం సిద్ధమైంది. ఈ వరల్డ్ కప్‌లో 16 దేశాలకు చెందిన టీమ్‌లు పాల్గొననున్నాయి. హెడ్ కోచ్ టాక్విర్ దర్, అసిస్టెంట్ కోచ్ డేనిష్ కలీమ్ ఆధ్వర్యంలో భారత్‌లో పర్యటించేందుకు వీలుగా వీసా కోసం ఎదురు చూస్తున్నామని పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ (పీహెచ్‌ఎఫ్) సెక్రెటరీ షాహ్‌బాజ్ అహమ్మద్ తెలిపాడు. రెండేళ్ల క్రితం భారత్‌లో జరిగిన జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో పాక్ జట్టు వీసా మంజూరుకాకపోవడంతో పాల్గొనలేకపోయింది. అయితే, ఇప్పుడు సీనియర్ హాకీ టీమ్ భారత్‌లో పర్యటించేందుకు ఎదురైన ఎన్నో అడ్డంకులు, అవరోధాలను దాదాపు అధిగమించినట్టేనని పేర్కొన్నాడు.

హాంకాంగ్ ఓపెన్ సెమీస్ నుంచి మొమోటా ఔట్
దక్షిణ కొరియా ఆటగాడి విజయం
హాంకాంగ్, నవంబర్ 17: హాంకాంగ్ ఓపెన్ సెమీఫైనల్స్‌లో టాప్ ర్యాంకర్, జపాన్‌కు చెందిన కెంటో మొమోటాకు చుక్కెదురైంది. శనివారం దక్షిణ కొరియా ఆటగాడు సన్ వాన్ హోతో జరిగిన పోరులో మొమోటా 18-21, 21-16, 21-19 తేడాతో ఓటమిని చవిచూశాడు. దాదాపు 89 నిమిషాలపాటు సాగిన తొలి మ్యాచ్‌లో ప్రత్యర్థిపై పైచేయి సాధించిన మొమోటా మిగిలిన రెండు మ్యాచ్‌లలో గట్టి పోటీ ఇవ్వలేకపోయాడు.