క్రీడాభూమి

వృషభ్ పంత్ విజృంభణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, మే 3: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచి, గుజరాత్ లయన్స్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుచేసింది. దినేష్ కార్తీక్ అర్ధ శతకంతో రాణించడంతో గుజరాత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేయగలిగింది. అతనితోపాటు రవీంద్ర జడేజా (36 నాటౌట్), కెప్టెన్ సురేష్ రైనా (24) కూడా కొంత వరకు పోరాటం సాగించడంతో ఈ మాత్రం స్కోరు సాధ్యమైంది. అయితే, సాదాసీదా లక్ష్యాన్ని డేర్‌డెవిల్స్ ఓపెనర్లు వృషభ్ పంత్, క్వింటన్ డికాక్ మరింత సులభతరం చేశారు. మొదటి వికెట్‌కు 115 పరుగులు జోడించి, జట్టును విజయానికి చేరువకు తెచ్చారు. 17.2 ఓవర్లలో డేర్‌డెవిల్స్ రెండు వికెట్లకు 150 పరుగులు చేసింది.
ప్రత్యర్థి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 17 పరుగుల స్కోరువద్ద స్టార్ ఆటగాడు బ్రెండన్ మెక్‌కలమ్ (1) వికెట్‌ను కోల్పోయింది. అతను జహీర్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ డ్వెయిన్ స్మిత్ (15)ను క్రిస్ మోరిస్ క్యాచ్ అందుకోగా షాబాజ్ నదీం అవుట్ చేశాడు. అదే ఓవర్ చివరి బంతికి ఆరోన్ ఫించ్ (5)ను వృషభ్ పంత్ క్యాచ్ అందుకోగా పెవిలియన్‌కు పంపాడు. కెప్టెన్ సురేష్ రైనా 20 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్ సాయంతో 24 పరుగులు చేసి అమిత్ మిశ్రా బౌలింగ్‌లో క్వింటన్ డికాక్ స్టంప్ చేయడంతో అవుటయ్యాడు. క్రీజ్‌లో నిలదొక్కుకొని ఒంటరి పోరాటం కొనసాగించిన దినేష్ కార్తీక్ 43 బంతుల్లో, ఐదు ఫోర్లతో 53 పరుగులు చేసి, మహమ్మద్ షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జేమ్స్ ఫాల్క్‌నెర్ 7, ఇషాన్ కిషన్ 2 పరుగులకు అవుట్‌కాగా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 26 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 36 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
గుజరాత్‌పై గెలవడానికి 150 పరుగుల సాధారణమైన లక్ష్యాన్ని చేదించేందుకు డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన క్వింటన్ డికాక్, వృషభ్ పంత్ అద్వితీయ ప్రతిభ కనబరిచారు. ఇద్దరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. జేమ్స్ ఫాల్క్‌నెర్ వేసిన 12వ ఓవర్ చివరి బంతిని వృషభ్ పంత్ సిక్స్‌గా మలచి, డేర్ డెవిల్స్ స్కోరును వంద పరుగుల మైలురాయిని దాటించాడు. తొలి వికెట్‌కు 115 పరుగులు జత కలిసిన తర్వాత, 40 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లతో 69 పరుగులు చేసిన వృషభ్ పంత్‌ను దినేష్ కార్తీక్ క్యాచ్ అందుకోగా రవీంద్ర జడేజా అవుట్ చేశాడు. తర్వాత కొద్ది సేపటికే డికాక్ వికెట్ కూడా కూలింది. అతను 45 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 46 పరుగులు చేసి, శివిల్ కౌశిక్ బౌలింగ్‌లో డ్వెయిన్ స్మిత్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. 121 పరుగుల వద్ద డేర్‌డెవిల్స్ రెండో వికెట్ కోల్పోయింది. ఆతర్వాత సంజూ శాంసన్ (13 బంతుల్లో 19 నాటౌట్), జీన్ పాల్ డుమినీ (7 బంతుల్లో 13 నాటౌట్) మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడ్డారు. రవీంద్ర జడేజా వేసిన ఇన్నింగ్స్‌లోవని 18వ ఓవర్ రెండో బంతిని శాంసన్ భారీ సిక్స్‌గా మార్చి డేర్‌డెవిల్స్‌కు తిరుగులేని విజయాన్ని అందించాడు.

* ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఈ మ్యాచ్‌కి ముందు తొలి వికెట్‌కు అత్యధికంగా 24 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. ఈ ఐపిఎల్‌లో అన్ని మ్యాచ్‌లకు కలిపి మొదటి ఇన్నింగ్స్ పార్ట్‌నర్‌షిప్ 58 పరుగులు. ఈ మ్యాచ్‌లో వృషభ్ పంత్, క్వింటన్ డికాక్ తొలి వికెట్‌కు 115 పరుగులు జోడించడం విశేషం.
* ఐపిఎల్‌లో అర్ధ శతకం సాధించిన పిన్న వయస్కుల జాబితాలో వృషభ్ పంత్‌కు రెండో స్థానం దక్కింది. 2013లో సంజూ శాంసన్ 18 సంవత్సరాల 169 రోజుల వయసులో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో అర్ధ శతకం చేసే సమయానికి వృషభ్ పంత్ వయసు 18 సంవత్సరాల, 212 రోజులు.
* గుజరాత్ లయన్స్ ఈ మ్యాచ్‌లో పవర్ ప్లే అవకాశాన్ని వినియోగించుకొని, మొదటిసారి రెండు కంటే ఎక్కువ వికెట్లు కోల్పోయింది. అంతేగాక, పవర్ ప్లేలో 35 పరుగులు చేయగలిగింది. ఇప్పటి వరకూ గుజరాత్‌కు పవర్ ప్లేలో ఇదే అత్యల్ప స్కోరు. గుజరాత్ ఈ విధంగా విఫలం కావడం విచిత్రం.
* రవీంద్ర జడేజా 27 ఇన్నింగ్స్ తర్వాత ఈ మ్యాచ్‌లో తొలిసారి ముప్పయికి పైగా పరుగులు సాధించాడు. 26 బంతుల్లో అతను 36 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. వరుస వైఫల్యాల తర్వాత అతను ఫామ్‌లోకి వచ్చాడు.
* డ్వెయిన్ స్మిత్ ఈ మ్యాచ్‌లో 15 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ క్రమంలోనే అతను ఐపిఎల్‌లో 2,000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఇంతకు ముందు వెస్టిండీస్ తరఫున క్రిస్ గేల్ (3,207 పరుగులు) మాత్రమే రెండు వేలు లేదా అంతకు మించి పరుగులు సాధించగలిగాడు.

సంక్షిప్త స్కోర్లు
గుజరాత్ లయన్స్: 20 ఓవర్లలో 7 వికెట్లకు 149 (దినేష్ కార్తీక్ 53, రవీంద్ర జడేజా 36 నాటౌట్, షాబాద్ నదీం 2/23).
ఢిల్లీ డేర్‌డెవిల్స్: 17.3 ఓవర్లలో 2 వికెట్లకు 150 (వృషభ్ పంత్ 69, క్వింటన్ డికాక్ 46).

జింబాబ్వే టూర్‌కు జూన్‌లో టీమిండియా
న్యూఢిల్లీ, మే 3: ఈ ఏడాది జూన్ మాసంలో జింబాబ్వే పర్యటనకు టీమిండియా వెళుతుంది. హరారేలో మూడు వనే్డ ఇంటర్నేషనల్స్, మరో మూడు టి-20 మ్యాచ్‌లు ఆడుతుంది. అన్ని మ్యాచ్‌లు హరారేలోని స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరుగుతాయని జింబాబ్వే క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధికారులతో చర్చించి, లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత షెడ్యూల్‌ను ప్రకటిస్తామని పేర్కొంది. వనే్డలు జూన్ 11 నుంచి 15 మధ్య జరుగుతాయని, అదే విధంగా టి-20 ఇంటర్నేషనల్స్‌ను 18 నుంచి 22 మధ్య నిర్వహించాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. ఇలావుంటే, ఈ టూర్ గురించి బిసిసిఐ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వెస్టిండీస్‌తో టూర్ కూడా ఉన్నందున, సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి, ద్వితీయ శ్రేణి క్రికెటర్లను జింబాబ్వేకు పంపే అవకాశాలు ఉన్నాయ. ఇటీవల కాలంలో దారుణంగా విఫలమవుతున్న జింబా బ్వేను ఆర్థిక సమస్యలు కూడా వెంటాడుతున్నాయ. భార త్‌తో సిరీస్ ద్వారా ఎంతో కొంత మొత్తాన్ని సంపాదించ వచ్చన్నది జింబాబ్వే క్రికెట్ బోర్డు ఆలోచన.