క్రీడాభూమి

అద్భుతంగా రాణిస్తేనే గొప్ప టీమ్‌గా నిలబడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొవిడెన్స్ (గుయానా), నవంబర్ 18: ఏ పోటీలోనైనా అద్భుతంగా రాణిస్తేనే గొప్ప టీమ్‌గా నిలబడగలుగుతామని టీమిండియా మహిళా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యాఖ్యానించింది. ఐసీసీ మహిళల వరల్డ్ టీ-20 చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం గ్రూప్ లీగ్‌లోని ఆఖరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన తర్వాత ఆమె మీడియాతో కాసేపు ముచ్చటించింది. లీగ్‌దశలో ఇప్పటికే తలపడిన మూడు జట్లపై ఘన విజయాన్ని నమోదు చేసుకున్న భారత్ సెమీఫైనల్స్‌కు చేరుకుని ఆస్ట్రేలియాపై కూడా విజయం సాధించింది. ‘ఒక గొప్ప టీమ్‌గా, మంచి టీమ్‌గా రాణించాలంటే అద్భుత ప్రతిభను చూపించాలి’ అని వ్యాఖ్యానించింది. లీగ్ దశలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో అనుకున్నంతగా తమ జట్టు ప్రతిభను కనబరచకపోయినప్పటికీ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా రాణించినందుకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొంది. ఆస్ట్రేలియాపై గెలుపు తమ జట్టు సభ్యులందరి సమష్టి కృషికి నిదర్శనంగా హర్మన్‌ప్రీత్ అభివర్ణించింది అంటూ ఈ ఘనత సాధించేందుకు సహకరించిన అందరికీ అభినందనలు తెలిపింది. ఓపెనర్ స్మృతి మంధాన మాట్లాడుతూ టీ-20లో జరిగిన తొలి మూడు మ్యాచ్‌లలో తాను ఆశించినంతగా ఆడలేకపోయానని, కానీ ఆసిస్‌పై తప్పనిసరిగా మంచి స్కోరు సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగినప్పటి నుంచి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించానని తెలిపింది. గత మూడు మ్యాచ్‌లతో పోల్చుకుంటే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో తమ జట్టు క్రికెటర్లు ఇటు బ్యాటింగ్, అటు ఫీల్డింగ్ విభాగాల్లో అద్భుతంగా మెరిశారని పేర్కొంది. యువ బ్యాట్స్‌ఉమన్ జమీమా రోడ్రిగ్స్ మాట్లాడుతూ ఈనెల 23న జరిగే సెమీఫైనల్స్‌లో సైతం ఇదే ఆటతీరుతో రికార్డు సృష్టిస్తామనే నమ్మకం ఉందని తెలిపింది.