క్రీడాభూమి

మనీషా...మజాకా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఏఐబీఏ మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్, హర్యాకు చెందిన మనీషా వౌన్ ఘన విజయం సాధించింది. ఆదివారం ఇక్కడ జరిగిన 54 కేజీల విభాగంలో పోటీపడిన మనీషా కజకిస్తాన్ బాక్సర్ దీనా ఝాలమాన్‌ను మట్టికరిపించింది. 20 ఏళ్ల మనీషా ప్రీక్వార్టర్ ఫైనల్స్‌లో జరిగిన పోరులో సీనియర్ బాక్సర్ అయిన ప్రత్యర్థిని 5-0తో ఓడించింది. ఇదే ప్రత్యర్థిపై ఈ ఏడాది ప్రథమార్థంలో పోలాండ్‌లో జరిగిన సిలేసియాన్ ఉమెన్స్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తొలిసారిగా మనీషా ఓడించింది. కాగా, తదుపరి పోరులో 2016 వరల్డ్ చాంపియన్‌షిప్ రజతం పతక విజేత, టాప్ సీడ్, బల్గేరియా బాక్సర్ స్టొయికా పెట్రోవాతో మనీషా తలపడుతుంది. ఇదిలావుండగా, ఆదివారం 81 కేజీల విభాగంలో, 69 కేజీల విభాగంలో మరో ఇద్దరు భారత బాక్సర్లు విజయం సాధించారు. లవ్‌లినా బోర్గోహైన్ 69 కేజీల విభాగంలో, కచారీ భాగ్యబతి 81 కేజీల విభాగంలో ప్రత్యర్థులను 5-0 తేడాతో ఓడించారు.
క్వార్టర్ ఫైనల్స్‌కు మేరీ కోమ్
భారత దిగ్గజ మహిళా బాక్సర్ మేరీ కోమ్ ఏఐబీఏ మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లో చోటు దక్కించుకుంది. ఆదివారం 48 కేజీల విభాగంలో జరిగిన పోటీలో మేరీ కోమ్ తన ప్రత్యర్థి, కజకస్తాన్ బాక్సర్ ఎయిగెరిమ్ కెస్సెనాయేవాను 5-0తో నిలువరించి క్వార్టర్ ఫైనల్స్‌లోకి చేరుకుంది. 35 ఈ మణిపురి బాక్సర్ మేరీ కోమ్ 2002 నుంచి 2010 వరకు జరిగిన వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లలో ఐదుసార్లు గోల్డ్‌మెడల్స్, ఒకసారి రజత పతకం అందుకుంది. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌మెడల్ సాధించడమనే తన ముందున్న లక్ష్యమని పేర్కొంది.