క్రీడాభూమి

జ్వెరెవ్‌కే ఏటీపీ టైటిల్ నవోక్ జొకోవిచ్‌కు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, నవంబర్ 19: ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్‌లో దిగ్గజ ఆటగాడు, ప్రపంచ నెంబర్ వన్ నవోక్ జొకోవిచ్‌కు షాక్ తగిలింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో జర్మనీ యువ సంచలన ఆటగాడు, 21 ఏళ్ల అలెగ్జాండర్ జ్వెరేవ్ చేతిలో జొకోవిచ్ ఓటమిని ఎదుర్కొన్నాడు. ఇద్దరి మధ్య జరిగిన తుది పోరులో జెరెవ్ 6-4, 6-3 తేడాతో ప్రత్యర్థిపై పైచేయి సాధించి టైటిల్‌ను తన ఖాతాలో జమ చేసుకున్నాడు. ఈ పోటీలోని సెమీఫైనల్స్‌లో ఆరుసార్లు చాంపియన్‌గా అవతరించిన రోజర్ ఫెదరర్‌ను సైతం ఈ యువ సంచలనం జ్వెరేవ్ ఓడించి, ఇపుడు తాజాగా ఫైనల్‌లో ప్రపంచ నెంబర్ వన్ దిగ్గజాన్ని మట్టికరిపించాడు. ఈ పెద్ద టోర్నమెంట్‌లో విజయం సాధించడం జ్వెరేవ్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం. మ్యాచ్ అనంతరం విజేత మీడియాతో మాట్లాడుతూ అతి పెద్ద టైటిల్ అందుకోవడం తనకు ఇదే తొలిసారి అని అంటూ దిగ్గజ ఆటగాడు జొకోవిచ్‌కు అభినందనలు తెలిపాడు.