క్రీడాభూమి

రియో ఒలింపిక్స్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా సచిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 3: రియో ఒలింపిక్స్‌కు మన దేశంలో గుడ్‌విల్ అంబాసిడర్‌గా సచిన్ తెండూల్కర్ పేరును భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) ప్రకటించింది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, ఏస్ షూటర్ అభినవ్ బింద్రాలను గుడ్‌విల్ అంబాసిడర్స్‌గా ఐఒఎ ఇప్పటికే ఖరారు చేసింది. తాజాగా సచిన్ పేరును కూడా ఖాయం చేసింది. అతను తమ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించాడని ఐఒఎ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా పిటిఐతో మాట్లాడుతూ అన్నాడు. సచిన్ వంటి ప్రముఖుడు గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తే రియో ఒలింపిక్స్‌కు ప్రచారం మరింతగా లభిస్తుందని పేర్కొన్నాడు. తమ ప్రతిపాదనను సచిన్ అంగీకరించడం తమ అదృష్టమని అన్నాడు.

సల్మాన్ ఖాన్‌ను గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించడంతో చెలరేగిన దుమారం నుంచి బయట పడేందుకు ఐఒఎ ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగానే సచిన్ తెండూల్కర్‌ను ఎంపిక చేసింది. క్రికెట్ రారాజుగా వెలిగిపోయన సచిన్‌కు ఇప్పటికీ కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అందుకే అతనిని గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించి, దిద్దు బాటు చర్యలు చేపట్టింది.