క్రీడాభూమి

నైట్ రైడర్స్‌కు ‘ఈడెన్’ బలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 3: ఈసారి ఐపిఎల్‌లో ఇప్పటి వరకూ ఎనిమిది మ్యాచ్‌లు ఆడి, ఐదు విజయాలను నమోదు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ బుధవారం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ను ఢీకొనేందుకు సిద్ధంగా ఉంది. హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ జరగడం నైట్ రైడర్స్ బలాన్ని పెంచుతోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరును సోమవారం నాటి మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఓడించిన నైట్ రైడర్స్‌కే విజయావకాశాలు ఉన్నాయి. బెంగళూరులో విజయానికి ఒకానొక దశలో ఆరు ఓవర్లలో 81 పరుగులు అవసరమయ్యాయి. అయితే, ఆండ్రె రసెల్ 24 బంతుల్లో 39 పరుగులు సాధించి విజయంపై ఆశలు పెంచాడు. యూసుఫ్ పఠాన్ విజృంభణ ఆ ఆశలను నిజం చేసింది. అతను 29 బంతుల్లోనే అజేయంగా 60 పరుగులు సాధించి బెంగళూరుపై నైట్ రైడర్స్‌కు విజయాన్ని అందించాడు. గౌతం గంభీర్ నాయకత్వంలోని ఈ జట్టులో రాబిన్ ఉతప్ప, మనీష్ పాండే, సూర్య కుమార్ యాదవ్, సునీల్ నారైన్, ఉమేష్ యాదవ్, పీయూష్ చావ్లా, యూసుఫ్ పఠాన్, ఆండ్రె రసెల్, షకీబ్ అల్ హసన్ వంటి సమర్థులు ఉన్నారు. తమదైన రోజున ఒంటి చేత్తో జట్టును గెలిపించే సత్తా వీరికి ఉంది. కాగా, డేవిడ్ మిల్లర్‌ను తప్పించి మురళీ విజయ్‌కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత పటిష్టంగా కనిపిస్తున్న గుజరాత్ లయన్స్‌ను పంజాబ్ ఓడించింది. కొత్త కెప్టెన్ సారథ్యంలో మరో విజయానికి సమాయత్తమవుతున్నది. హోం గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడుతున్న నైట్ రైడర్స్‌ను ఓడించడం పంజాబ్‌కు సులభం కాకపోయినా, సంచలన ఫలితాన్ని నమోదు చేసే అవకాశాలు లేకపోలేదు.